vishvavyaapta avadhaana shishya padmaakaramవిశ్వవ్యాప్త అవధాన శిష్య పద్మాకరంfavorite_border

Start Dateప్రారంభపు తేది
Sunday, March 6, 2022
End Dateచివరి తేది
Sunday, March 6, 2022
Timeసమయం
సా.5.30 గం.లకు (భారత కాలమానప్రకారం)
శ్రీ మహాగణాధిపతయేనమః
శ్రీ గురుభ్యోనమః
శ్రీ మహాసరస్వత్యైనమః

విశ్వవ్యాప్త అవధాన శిష్య పద్మాకరం

త్రిభాషామహాసహస్రావధానులు, శ్రీప్రణవపీఠాధీశులు, అవధానకోకిల, ఆంధ్రభాషాభూషణ, ధారణావేదావధాననిధి, సమర్థ సద్గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు సాహితీసేవలో భాగంగా తమ మనస్సంకల్ప జనితమైన సప్త ఖండ అవధాన సాహితీ ఝరి లో సప్తఖండాలలో దేశవిదేశాలలో ఉన్న సాహితీ అభిమానులకు పృచ్ఛకులుగా అవసరమైన శిక్షణను ఇప్పిస్తూ, వారందరినీ అవధానంలో పాల్గొనేలా చేస్తూ, అవధానజైత్రయాత్ర కొనసాగించడం జగద్విదితం.

ఇందులో భాగంగా శ్రీ గురుదేవులు స్వీయ సంచాలకత్వంలో, వారి అనుంగు శిష్యులైన అమెరికా అవధాని శ్రీ పాలడుగు శ్రీ చరణ్ గారిచే, శ్రీ తటవర్తి శ్రీ కల్యాణ చక్రవర్తి గారిచే, తమ సత్సంగ శిష్యులను, సభ్యులను పృచ్ఛకులుగా చేర్చి తమ అపారతపశ్శక్తితో సాధించిన త్రిభాషాధురీణతను ఈ సాహితీసేవ ద్వారా నిరాటంకంగా, నిర్విరామంగా పదిమందికీ అందజెయ్యాలనే శ్రీ గురుదేవుల సంకల్పం సరస్వతీసమన్వితం.

విశ్వవ్యాప్త అవధాన శిష్య పద్మాకరం శీర్షికలో  మొదటగా తొలి అవధానం శ్రీ గురుదేవుల అనుంగు శిష్యులు శ్రీ పాలడుగు శ్రీ చరణ్ గారి 25వ అష్టావధానం.

తేదీ : మార్చి 6, 2022 2022 (ఆదివారం) 
సమయం : సా.5.30 గం.లకు (భారత కాలమానప్రకారం)

సాక్షాత్ శారదామాతృస్వరూపుల గురుత్వంలో శిష్య సారస్వతమును తిలకించడం అపూర్వం. రసజ్ఞులైన తెలుగు భాషాభిమానులనే కాక యువతకు స్ఫూర్తిని, బుద్ధి ప్రచోదనాన్ని, వికాసాన్ని కలిగిస్తూ రసవత్తరంగా సాగే ఈ మహత్తర అవధాన కార్యక్రమాన్ని అంతర్జాల మాధ్యమముగా యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చును.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

బలం గురోః ప్రవర్ధతాం!
expand_less