Brahmasri Vaddiparti Padmakar Gaaruబ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు

పేరు : బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ 

తల్లిదండ్రులు: బ్రహ్మశ్రీ వద్దిపర్తి చలపతిరావు గారు , శ్రీమతి శేషమణి గారు

అష్టావధానాలు : 1243 పూర్తి చేశారు

శతావధానాలు : 12

 1. ఏలూరు
 2. విశాఖపట్నం
 3. తాడేపల్లిగూడెం
 4. చల్లపల్లి
 5. గుంటూరు
 6. రాజమండ్రి
 7. నరసరావుపేట
 8. హైదరాబాదు
 9. సికింద్రాబాద్
 10. హైదరాబాదు
 11. సికింద్రాబాదు 

జంట అవధానాలు : 

 • శ్రీ కొండేపి మురళీ కృష్ణ గారితో కలిసి 6  మరియు  శ్రీ శ్రీచరణ్ పాలడుగు గారితో 2 అవధానములు నిర్వహించినారు 

హిందీ అవధానం : 

 • సెంట్రల్ హిందీ డైరెక్టరేట్, ఆగ్రాలో హిందీలో అవధానం చేసి ప్రముఖుల ప్రశంసలు పొందిన ఏకైక త్రిభాషా మహాసహస్రావధాని 

త్రిభాషా మహాసహస్రావధానం:

 • ఏలూరులో ఆంధ్ర, హిందీ, సంస్కృతభాషలలో మహావధానం  చేశారు.

అద్వితీయ  ధారణ  : 

 • 756 పద్యాలు కదలకుండా 207 ని॥లలో (3గం॥27॥ ని ॥లలో) ధారణ చేసిన ఏకైకసహస్రావధాని.
 • భాగవతంలోని వేలాది పద్యాలు, ప్రాచీన కావ్యాలలోని వేలాది పద్యాలు ఆసువుగా చెప్పగలరు.

మరొక ప్రత్యేకత : 

 • భారత, భాగవత, రామాయణాలే కాక అష్టాదశ పురాణాలను ఉపన్యసించి, అంబికావారి ఆస్థాన పౌరాణికునిగా నియమితులైన ఏకైక సహస్రావధాని.

బిరుదులు :

 1. అభినవశుక
 2. ఆంధ్రమురారి
 3. ఆంధ్రభాషా భూషణ
 4. సరస్వతీపుత్ర
 5. కవిరాజశేఖర
 6. అవధానకోకిల 
 7. ధారణాచిత్రగుప్త (జొన్నవిత్తుల వారు ఇచ్చారు)
 8. భాగవత కళ్యాణకృష్ణ
 9. పంచామృత ప్రవచక 
 10. సహస్రపద్మ 
 11. పౌరాణిక సార్వభౌమ
 12. ధారణా వేదావధాననిధి (శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఇచ్చారు)

భాగవతసప్తాహ ప్రత్యేకత : 

 • ఆంధ్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, కేరళ,తమిళనాడులోను, నైమిశారణ్యము, శుకస్థల్, బృందావనాది పుణ్యక్షేత్రాలలోను భాగవత సప్తాహాలు చేశారు. 
 • భాగవతం మొత్తం పుస్తకం లేకుండా ప్రవచనం చేయగలిగిన ఏకైక సహస్రావధాని
 • వింధ్యాచలంలో దేవీ భాగవత నవాహ ప్రవచనములు చేసినారు.

సమర్థ సద్గురత్వము : 

 • దాదాపు 1,00,000 మందికి పైగా మంత్రోపదేశాలు చేసి వారిని ఆధ్యాత్మికమార్గంలో నడుపుతూ ప్రణవ పీఠం స్థాపించి శిష్యుల చేత ‘సమర్థ సద్గురు’ బిరుదు పొందిన అవధాని.

సన్మానాలు : 

 1. పల్లకీ ఊరెరిగింపు (ఏలూరు) 
 2. హెలికాప్టర్ అధిరోహణ 
 3. సువర్ణ కంకణధారణ
 4. రథారోహణ, బృందావనం, ఆగ్రా జిల్లా, ఉత్తరప్రదేశ్, ఇవి కాక అసంఖ్యాకంగా ప్రజా సత్కారాలు
 5. ఏలూరులో గజారోహణ మరియు గండపెండేర సత్కారాలు.

రచనలు :

 1. కలకింకిణులు(ముద్రితం) 
 2. శ్రీ సత్యసాయి సప్తశతి(ముద్రితం)
 3. శ్రీనీలకంఠేశ్వర శతకం(ముద్రితం)
 4. హనుమన్మహిమ(అముద్రితం) 750 పద్యాల ఖండ కావ్యం, ‘మానవకథ’ పద్యకావ్యం, ఇంకా పలు కథలు, వ్యాసాలు.

రూపకాలు : 

 • వందలాది రూపకాలు నిర్వహించారు, భువన విజయంలో తెనాలి రామకృష్ణ, అవధాని విజయంలో  చెళ్ళపిళ్ళ, సుధర్మా సభలో నారద పాత్రలు ప్రత్యేకాలు.

ఆశు కవితలో ప్రత్యేకత: 

 • 90 ని॥లలో 180 పద్యాలు ఆశువుగా చెప్పుట.

పాదయాత్రా ధురీణత :

 • వేలాది భక్తులతో ఆంధ్రాలోని ద్వారకాతిరుమల, విజయవాడ కనకదుర్గ ఆలయం మొదలైన  ప్రముఖ దేవాలయములకు  పాదయాత్ర చేయించుట. 

పీఠాధిపతుల సత్కారాలు :

 1.  శృంగేరీ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు 
 2. శ్రీసత్యసాయిబాబా 
 3. శ్రీగణపతి సచ్చిదానందస్వామిజీ
 4. శ్రీవిశ్వయోగి విశ్వంజీ
 5.  శ్రీవాడేకర్మహారాజ్ వంటి ప్రముఖ పీఠాధిపతుల సత్కారాలు పొందారు.

ఆస్థాన విద్వాంసులు :  

 • 2003సం॥ మే నెల నుండి అవధూత దత్తపీఠము మైసూర్ వారి ఆస్థానవిద్వాంసులుగా నియమింపబడిరి.

విదేశీ పర్యటనలు :

 • పురాణ ప్రవచనములు, సాహిత్యోపన్యాసాలు, అవధానాల  నిమిత్తం   సం॥ 2006 నుండి ప్రతి సంవత్సరము ఏప్రిల్, మే నెలలో అమెరికా లో ఉన్న కొన్ని ముఖ్యమైన పట్టణాలలో పర్యటిస్తుంటారు.
 • సింగపూర్ లో ది.29-04-2006 నుండి ది.05-05-2006 వరకు అవధానాలు ప్రవచనాలు చేశారు చేశారు.
 • దుబాయిలో ది.01-04-2008 నుండి ది.06-04-2008 వరకు పంచాంగ ప్రవచనములు, పురాణ ప్రవచనములు చేసారు
expand_less