శ్రీ మహాగణాధిపతయేనమః శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః “ఉత్తరాయణ పుణ్యకాలశుభవేళ - సాహితీ క్రాంతుల సంక్రాంతి” ఒకే రోజులో రెండు అష్టావధానములు "సప్త ఖండ అవధాన సాహితీ ఝరి" లో భాగంగా శ్రీప్రణవపీఠాధీశులు, త్రిభాషామహాసహస్రావధానులు, ఆంధ్రభాషాభూషణ, ధారణావేదావధాననిధి, సమర్థ సద్గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 1239 వ అష్టావధానం! ఈ అపురూపమైన అవధాన కార్యక్రమంలో మన భాగ్యవశమున విశ్వవ్యాప్తంగా దత్తసంప్రదాయానికి శ్రీకారం చుట్టిన దివ్యపురుషులు, అవధూత దత్తపీఠాధిపతి, జగద్గురు పరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి కరకమల సంజాతులు, శ్రీ అవధూత దత్తపీఠ ఉత్తరాధిపతులు, పరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు విచ్చేసి తమ దివ్యదర్శనం, అనుగ్రహభాషణం అందజేస్తారు. తేదీ : జనవరి 15 వ తేది 2022 (శనివారం), ఉ.8.00 గం.లకు (భారత కాలమానప్రకారం) "సప్త ఖండ అవధాన సాహితీ ఝరి" లో భాగంగా "ఉత్తర అమెరికా" ఖండం నందు గల అమెరికా దేశం నుండి పండితోత్తములు, అవధానులు, సంచాలకులుగా, పృచ్ఛకులుగా పాల్గొంటున్నారు. అపరసరస్వతీ స్వరూపులు శ్రీగురుదేవుల అపురూప సాహితీవిలాసం అవధానరూపంలో తిలకించడం మహద్భాగ్యమే కాక యావత్ సాహితీ అభిమానులకు, చూపరులకు మనోరంజకం, స్ఫూర్తిదాయకం. ఈ మహత్తర కార్యక్రమాన్ని అంతర్జాల మాధ్యమముగా యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చును. పదిమందికీ తెలియజేయండి, సమాజానికి హితం చేకూర్చే సాహిత్యాన్ని పసందైన అవధానసాహితీవిందు రూపంలో ఆస్వాదించండి. https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial బలం గురోః ప్రవర్ధతాం!