మహాశివరాత్రి పర్వదినం పిదప శివకటాక్షంచే అవధాన పద్మాకరము నుండి పద్యామృతాభిషేకంమహాశివరాత్రి పర్వదినం పిదప శివకటాక్షంచే అవధాన పద్మాకరము నుండి పద్యామృతాభిషేకంfavorite_border

Start Dateప్రారంభపు తేది
Friday, March 4, 2022
End Dateచివరి తేది
Friday, March 4, 2022
Timeసమయం
సా.5.00 గం.లకు (భారత కాలమానప్రకారం)
శ్రీ మహాగణాధిపతయేనమః
శ్రీ గురుభ్యోనమః
శ్రీ మహాసరస్వత్యైనమః

మహాశివరాత్రి పర్వదినం పిదప శివకటాక్షంచే అవధాన పద్మాకరము నుండి పద్యామృతాభిషేకం

శ్రీప్రణవపీఠాధీశులు, త్రిభాషామహాసహస్రావధాని, ఆంధ్రభాషాభూషణ, ధారణావేదావధాననిధి, సమర్థ సద్గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి మనస్సంకల్ప జనితం - 
"సప్త ఖండ అవధాన సాహితీ ఝరి" లో భాగంగా 1241 వ అష్టావధానం! ఈ అపురూపమైన అవధాన కార్యక్రమంలో ప్రముఖ ప్రవచనకర్త "సమన్వయ సరస్వతి" బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు విబుధ అతిథిగా విచ్చేస్తున్నారు.

తేదీ: మార్చి 4, 2022 (శుక్రవారం), 
సమయం: సా.5.00 గం.లకు (భారత కాలమానప్రకారం)

"సప్త ఖండ అవధాన సాహితీ ఝరి" లో భాగంగా "ఆసియా ఖండం"లో మధ్యప్రాచ్య ప్రాంతమునుండి గల్ఫ్ దేశాలైన ఖతార్, కువైట్, బహరైన్, ఓమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  మొదలైన దేశాల నుండి వివిధ తెలుగు అసోసియేషన్ల నుండి ప్రతినిధులు, తెలుగు సాహిత్యాభిమానులు పృచ్ఛకులుగా  పాల్గొంటుండగా సంచాలకులుగా, మొట్టమొదటి ఆస్ట్రేలియా అవధాని, "అవధాన శారదామూర్తి" బిరుదాంకితులు శ్రీ తటవర్తి శ్రీ కల్యాణ చక్రవర్తి  వ్యవహరించనున్నారు.

ఈ మహత్తర కార్యక్రమాన్ని అంతర్జాల మాధ్యమముగా యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చును. పదిమందికీ తెలియజేయండి, సమాజానికి హితం చేకూర్చే సాహిత్యంలో ఎంతో వైశిష్ట్యాన్ని సంతరించుకున్న అవధానకళ ద్వారా సాహితీసుధారసాన్ని అస్వాదించండి.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

బలం గురోః ప్రవర్ధతాం!
expand_less