శ్రీ మహాగణాధిపతయేనమః శ్రీ గురుభ్యోనమః శ్రీ మహాసరస్వత్యైనమః శుభకృత్ సాహితీ ఉగాది - కామాక్షీకటాక్షం - అంతర్జాతీయ అవధాన శోభ శ్రీ ప్రణవపీఠాధీశులు, త్రిభాషామహాసహస్రావధాని, ఆంధ్రభాషాభూషణ, ధారణావేదావధాననిధి, సమర్థ సద్గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి మనస్సంకల్ప జనితం - "సప్త ఖండ అవధాన సాహితీ ఝరి" లో భాగంగా 1242 వ అష్టావధానం! 2022వ సంవత్సరం శుభకృత్ నామ తెలుగు ఉగాది పండుగను పురస్కరించుకుని, ఆధ్యాత్మిక గురువరేణ్యులు, శ్రీ కంచికామకోటిపీఠం 70వ పీఠాధిపతులు జగద్గురు పరమపూజ్య శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారు అపారకారుణ్యంతో అందిస్తున్న దివ్యదర్శనం, దివ్యశుభమంగళాశాసనముల అనుగ్రహభాషణం. తేదీ: ఏప్రిల్ 3, 2022 (ఆదివారం) సమయం: ఉ.7.00 గం.లకు (భారత కాలమానప్రకారం) రా. 9.00 గం.లకు ("కెనెడా" EST) "సప్త ఖండ అవధాన సాహితీ ఝరి" శీర్షికలో భాగంగా జరుగుతున్న ఈ అష్టావధానంలో "ఉత్తర అమెరికా" ఖండంలో గల కెనడా దేశం నుండి 8 మంది ప్రవాసభారతీయ నారీమణులు పృచ్ఛకురాండ్రుగా పాల్గొంటుండగా, సంచాలకులుగా మొట్టమొదటి ఆస్ట్రేలియా అవధాని, "అవధాన శారదామూర్తి" బిరుదాంకితులు శ్రీ తటవర్తి శ్రీ కల్యాణ చక్రవర్తి గారు వ్యవహరించనున్నారు. ఈ శీర్షికలో గత సంవత్సరం మే 2021 నుండి ఇప్పటివరకు అప్రతిహతంగా ప్రతిమాసం 11 అష్టావధానాలు పూర్తిచేసిన పుంభావసరస్వతీ స్వరూపులు శ్రీగురుదేవుల అపురూప అవధానం వీక్షించడం సాహితీ అభిమానులే కాక అందరూ సుకృతంగా భావిస్తారు. వివిధ కోణాలను, అంశాలను స్పృశిస్తూ, పాండితీప్రకర్ష ప్రస్ఫుటంగా ప్రకటిమవుతూ సాహితీవినోదాన్ని పంచుతూ ఆద్యంతం రసవత్తరంగా సాగే వారి అవధానం మనోరంజకం, స్ఫూర్తిదాయకం. ఈ మహత్తర కార్యక్రమాన్ని అంతర్జాల మాధ్యమముగా యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చును. పదిమందికీ తెలియజేయండి, సమాజానికి హితం చేకూర్చే సాహిత్యాన్ని, పసందైన సాహిత్యపు విందును అస్వాదించండి. https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial బలం గురోః ప్రవర్ధతాం!