శ్రీ మహాగణాధిపతయేనమః శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రేనమః "సప్త ఖండ అవధాన సాహితీ ఝరి" లో భాగంగా "ఆసియా" ఖండంలో ఉన్న "మలేషియా తెలుగు సంఘం" తరఫున తమ వంతుగా తెలుగు వైభవాన్ని వ్యాప్తి చేస్తున్న తెలుగుభాషాసేవకులైన నారీమణులు పృచ్ఛకురాండ్రుగా శ్రీ ప్రణవపీఠాధీశులు, త్రిభాషా మహాసహస్రావధానులు, ఆంధ్రభాషా భూషణ, ధారణావేదావధాననిధి సమర్థ సద్గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 1237 వ అష్టావధానం! నవంబరు 6 వ తేదీ, శనివారం సాయంకాలం 4.00 గంటలకు (భారత కాల మాన ప్రకారం) / సాయంకాలం 6.30 గంటలకు (మలేషియా కాల మాన ప్రకారం) జరుపుతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఈ అవధానం లో మలేషియా ఉన్న ప్రవాసభారతీయ నారీమణులు పృచ్ఛకురాండ్రుగా ఉండటం విశేషం. అలాగే ఈ అవధానంలో విబుధ అతిథులుగా బహుభాషావేత్త భారతదేశ తొమ్మిదవ ప్రధాని శ్రీ పి.వి.నరసింహారావుగారి కుమార్తె, ప్రముఖ రాజకీయవేత్త, విద్యావేత్త, తెలంగాణా రాష్ట్ర ఎమ్మెల్సీ,శ్రీమతి ఎస్. సురభివాణీ దేవి గారు విచ్చేస్తున్నారు. సంచాలకులుగా ప్రసిద్ధ కవి, ఆస్ట్రేలియా అవధాని (ఆస్ట్రేలియా లో ఉండే ) శ్రీ తటవర్తి కల్యాణ చక్రవర్తి గారు వ్యవహరించనున్నారు. సమాజానికి హితం చేకూర్చేదే సాహిత్యం అని ఆర్యోక్తి. మన మాతృభాష తెలుగుభాషాసాహితీప్రక్రియలలో తలమానికం, పద్య గద్య కవితా సమ్మిశ్రితం, చమత్కారభరితం, సాహితీప్రియమనోల్లాసం, సకలజనజ్ఞానప్రదీప్తం "అవధానం" అనే క్రీడావిశేషం. చతుష్షష్టి కళారూపమైన అద్భుత అవధాన ప్రక్రియను అపరసరస్వతీ స్వరూపులు శ్రీగురుదేవులు చేస్తుండగా వీక్షించడం మహద్భాగ్యంగా భావించే సాహితీప్రియులు కోకొల్లలు. ఈ మహత్తర కార్యక్రమం అంతర్జాల మాధ్యమంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ యూట్యూబ్ ఛానల్స్ లో, ఫేస్ బుక్ లో అలాగే అమెరికా టి.వి. లాంటి తదితర ప్రసారమాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడును. ఈ అపురూపమైన కార్యక్రమం గురించి పదిమందికీ తెలియజేయండి, పసందైన సాహిత్యపు విందును ఆస్వాదించండి. https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial బలం గురోః ప్రవర్ధతాం!