శ్రీ మహాగణాధిపతయేనమః
శ్రీ గురుభ్యోనమః
శ్రీ మాత్రేనమః
శ్రీ కృష్ణ, శ్రీ కాలభైరవ, శ్రీ పుత్రదేశ్వర లింగప్రతిష్ఠ – శ్రీ ప్రణవపీఠం, ఏలూరు
మాఘ పూర్ణిమ శ్రేష్ఠమని, ఈ తిథినాడు చేసే జప, తప, దాన మరియు ధర్మ, పుణ్యకార్యాలు వెయ్యిరెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రవచనం. మాఘపూర్ణిమ నాడు విగ్రహ ప్రతిష్ఠ చేసినవారు, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని చూచినవారు, వారి వంశస్థులందరూ తరించి ఈ జన్మలోనే ముక్తి పొందుతారని శ్రీ స్కాందపురాణంలో సుస్పష్టంగా సాక్షాత్ నారాయణాంశ సంభూతుడు వేదవ్యాస మహర్షి తెలియజేసారు.
అంతటి పవిత్రతను సంతరించుకున్న మాఘపూర్ణిమ రోజే శతాధిక ఆలయ ప్రతిష్ఠాపనాచార్యులు, సమర్థసద్గురువులు, త్రిభాషామహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులు త్రిమాతృసహిత శ్రీ ప్రణవపీఠమును స్థాపించారు. మన భాగ్యవశమున ఈ పీఠంలో 2022వ సంవత్సరం, శ్రీ ప్రణవపీఠం 9వ వార్షికోత్సవం సందర్భంగా పూజ్య గురుదేవుల సువర్ణహస్తముల మీదుగా
శ్రీ కృష్ణ పరమాత్ముని విగ్రహ ప్రతిష్ఠ ఉదయం 6గం.35.నిలకు,
ఈ క్షేత్ర సముదాయానికి క్షేత్రపాలకుడు కాలభైరవుని విగ్రహ ప్రతిష్ఠ ఉదయం 6గం.45.నిలకు
మరియు శ్రీ పుత్రదేశ్వరుని లింగప్రతిష్ఠ ఉదయం 7గం.12.నిలకు దివ్యంగా, అంగరంగవైభవంగా జరిగాయి.
ఆ చిత్రమాలిక మన అందరికోసం