శ్రీ దేవి నవరాత్రుల వేడుకలు – 2022 పోటీలుశ్రీ దేవి నవరాత్రుల వేడుకలు - 2022 పోటీలుfavorite_border

శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యోనమః
శ్రీ మాత్రే నమః

    శ్లో: సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే,
     శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే

పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి మరియు ధర్మపత్ని శ్రీమతి రంగవేణి అమ్మ గారికి జయము జయము 🙏
ఆశ్వీయుజము వచ్చింది అంటే! ప్రజలంతా ఎంతో ఆనందాన్ని పొందుతారు. ఆ ఆనందానికి గలకారణం "అమ్మ"! అమ్మ అంటే! మరి ఎవరోకాదు ఆ జగన్మాత , ముగ్గురమ్మలతల్లి.

ఈశక్తి కనుక లేకుంటే! శివుడైనా ఏమి చెయ్యలేడని,శివునియొక్క శక్తి రూపమే "దుర్గ" యని ఆదిశంకరాచార్యుల వారు వారి అమృతవాక్కులో పేర్కొన్నారు. ఈ అమ్మవారు రాత్రిరూపం గలది అని పరమేశ్వరుడు పగలు రూపం గలవాడు అని ఈ దేవిని రాత్రి సమయాల్లో అర్చిస్తే! సర్వపాపాలు నాశనమౌతాయని సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం మనకు తెలియచెస్తోంది. ఆ దేవి, పాడ్యమి మొదలు నవమి వరకు ఒక్కోరోజు ఒక్కో రాక్షసుని వధించసాగింది.
అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయాలన్నా? మనకు ఏర్పడిన సర్వ దుఃఖాలు ఉపసమనం పొందాలన్నా? దారిద్ర్యం తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఇహలోక పరలోక సుఖాలను పొందుటకై ఈదేవి నవరాత్రుల యందు ఆ దేవదేవికి పూజలతోపాటు, దుర్గా సప్తశతి శ్రీలలితాసహస్రనామ పారాయణలు నిత్యమూ గావించి ఆ జగన్మాత కృపాకటాక్ష వీక్షణలు పొందాలని మన గురువు గారు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు మనకు నిత్యం తెలుపుతుంటారు
దసరా సందర్బంగా దేవీనవరాత్రులలో  శ్రీ ప్రణవ పీఠ శిష్య బృందం, పూజ్య గురుదేవులు ప్రవచించిన   శ్రీమద్దేవిభాగవతం నుండి ప్రసంగపు పోటీలు, క్విజ్ పోటీలు మరియు చిత్రలేఖనపు పోటీలు, అమ్మవారి స్వరూప పోటీలు నిర్వహిస్తున్నారు. అందరూ పాల్గొని అమ్మ లీలలు ప్రేమ మరియు భక్తితో ప్రసంగించండి. అమ్మ కృప కు, గురుదేవుల అనుగ్రహానికి పాత్రులు అవ్వండి
 
ప్రసంగపు పోటీలలో మీ పేరు నమోదుకు Sep 6 నుండి Sep 21 వరకు మాత్రమే సమయం .

చిత్రలేఖనపు పోటీలలో మీ శ్రీ మద్దేవీభాగవతము సంబంధించిన చిత్రాలుపంపుటకు ఆఖరి సమయం sep 25. 
యూట్యూబ్ లింక్: https://youtube.com/playlist?list=PLfgDt5ZsV1JIuE8J5FjvC53RqnYZkuFFq 

Sep 24 వ తేదీ శ్రీ మద్దేవీభాగవతము ప్రసంగపు పోటీలు నిర్వహిస్తారు.
చిత్రలేఖనపు పోటీలు సబ్మిషన్ కు ఆఖరు తేదీ Sep 25th, 2022.
దేవీనవరాత్రుల వేడుకల కార్యక్రమం Oct 9వ, 2022 తేదీ నిర్వహించబడుతుంది. 

ప్రసంగపు పోటీలలో నమోదు చేసుకోవటానికి మరియు చిత్రాలు పంపుటకు క్రింద ఇవ్వబడిన వెబ్సైటు లింకు ను సందర్శించగలరు.
1) చిత్రలేఖనం (Art competition) - Click here 
చిత్రలేఖనపు పోటీలు సబ్మిషన్ కు ఆఖరు తేదీ Sep 25th.
2) ప్రసంగపు పోటీలు (Speech competition) - Click here
 దేవీనవరాత్రుల Sep 24 తేదీ శ్రీ మద్దేవీభాగవతము ప్రసంగపు పోటీలు నిర్వహిస్తారు.
3) స్వరూప పోటీలు (Costume contest)- Click here
స్వరూప పోటీలు Sep 25 తేదీ నిర్వహిస్తారు 

ధన్యవాదములు
బలం గురోఃప్రవర్థతాం        బలం విష్ణోఃప్రవర్థతాం
expand_less