శ్రీ దేవి నవరాత్రుల వేడుకలు – 2022 ప్రసంగపు పోటీలు (Speech competition) శ్రీ దేవి నవరాత్రుల వేడుకలు – 2022 ప్రసంగపు పోటీలు (Speech competition)favorite_border

శ్లో: అంబా రౌద్రిణి భద్రకాళీ బగళా జ్వాలాముఖీ వైష్ణవీ, బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్జ్వలా, చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ భైరవీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ.

శ్రీ ప్రణవపీఠా ధీశులు, త్రిభాషామహాసహస్రావధాని
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవ ప్రవచిత
శ్రీ మద్దేవీ భాగవతము 
ప్రసంగపు పోటీలు మరియు చిత్రలేఖనపు పోటీలు 
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవుల అనుగ్రహంతో శ్రీ ప్రణవ పీఠం ఆధ్వర్యంలో 
దసరా నవరాత్రుల సందర్భంగా పూజ్యగురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ప్రవచించిన శ్రీమద్దేవీభాగవతం నుండి కొన్ని అంశముల నుంచి పోటీలు నిర్వహించుకోవడం జరుగుతుంది.

 శ్రీమద్దేవీభాగవతం లో పద్దెనిమిది వేల శ్లోకాలు, పన్నెండు స్కంధాలు, మూడు వందల పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి.

మహా పురాణము లో సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము అనే అయిదు లక్షణాలు కలవు. 
ప్రథమ స్కంధము:
ఇందులో దేవీ మహిమ, హయగ్రీవుడు, మథుకైటభులు, పురూరవుడు, ఊర్వశి, శుకుని జననము, సంతతి మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.

ద్వితీయ స్కంధము: ఇందులో మత్స్యగంధి, పరాశరుడు, వ్యాసుడు, శంతనుడు, గాంగేయుడు, సత్యవతి, కర్ణుడు, పాండవుల జననం, పరీక్షిత్తు, ప్రమద్వర కథ, తక్షకుడు, సర్పయాగం, జరత్కారువు మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.

తృతీయ స్కంధము: ఇందులో సత్యవ్రతుని కథ, దేవీ యజ్ఞం, ధ్రువసంధి కథ, భారద్వాజుడు, నవరాత్రి పూజ, రామ కథ మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.

చతుర్థ స్కంధము: ఇందులో నరనారాయణులు, ఊర్వశి, ప్రహ్లాదుడు, భృగు శాపం, జయంతి, శ్రీకృష్ణ చరిత్ర మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.

పంచమ స్కంధము: ఇందులో మహిషుడు, తామ్రుడు, అసిలోమాదులతో దేవీ యుద్ధం, రక్తబీజుడు, శుంభ నిశుంభులు మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.

షష్ఠ స్కంధము: ఇందులో నహుషుని వృత్తాంతం, అడీ బక యుద్ధం, వశిష్టుని రెండవ జన్మ, నిమి విదేహ కథ, హైహయ వంశం, నారదుడు మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
సప్తమ స్కంధము: ఇందులో బ్రహ్మ సృష్టి, సూర్యవంశ కథ, సుకన్య చ్యవనుల చరిత్ర, రేవతుడు, శశాదుడు, మాంధాత, సత్యవ్రతుడు, త్రిశంకు స్వర్గం, దక్షయజ్ఞం, దేవీ స్థానాలు మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.

అష్టమ స్కంధము: ఇందులో ఆదివరాహం, ప్రియవ్రతుడు, సప్తద్వీపాలు, కులపర్వతాదులు, ద్వీపవృత్తాంతం, సూర్యచంద్రుల స్థితగతులు, శింశిమార చక్రం, అధోలోకాలు, నరకలోక, దేవీపూజ, మధూక పూజావిధి మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.

నవమ స్కంధము: ఇందులో పంచశక్తులు, పంచ ప్రకృత్యాదుల కథ, కృష్ణుని సృష్టి, సరస్వతీ పూజ, కవచం, స్తుతి, కలి లక్షణాలు, గంగోపాఖ్యానం, వేదవతి, తులసి చరిత్ర, స్వాహా, స్వధ, దక్షిణ, షష్ఠీదేవి, సురభి, రాధా స్తోత్రం మొదలైన విషయాలు వివరించబడ్డాయి.

దశమ స్కంధము: ఇందులో వింధ్య గర్వాపహరణ, మనువులు భ్రామరి గురించి వివరించబడ్డాయి.

ఏకాదశ స్కంధము: ఇందులో సదాచారం, రుద్రాక్ష కథ, జపమాల, శిరోవ్రతం, సంధ్య, గాయత్రీ ముద్రలు, దేవీ పూజాదులు గురించి వివరించబడ్డాయి.

ద్వాదశ స్కంధము: ఇందులో గాయత్రీ విచారము, కవచము, హృదయము, స్తోత్రము, సహస్రనామ స్తోత్రము, గాయత్రి దీక్షా లక్షణము, గౌరముని శాపము, మణిద్వీపం, దేవీ భాగవత ప్రశస్తి గురించి వివరించబడ్డాయి.

శ్రీమద్దేవీభాగవతం యూట్యూబ్ లింక్: https://youtube.com/playlist?list=PLfgDt5ZsV1JIuE8J5FjvC53RqnYZkuFFq 

నియమాలు:
​​​​​​ 1. ప్రసంగపు పోటీలు అంతర్జాలంలో జరుగుతాయి.
​​​​​​ 2. మీకు కేటాయించిన సమయంలోనే ఐదు నిమిషముల పాటు ప్రసంగం చేయవలసి ఉంటుంది.
​​​​​ 3. 6 సంవత్సరముల పైన వయస్సు  ఉన్న అందరూ ఈ పోటీకి అర్హులే
​​​​ 4. మొదటి విభాగం - 15 సంవత్సరాల వయస్సు లోపు వారు
​​​​ 5. రెండవ విభాగం - 15 సంవత్సరాల పైన వయసు ఉన్న వారందరూ
 6. ​​​​మీ స్వీయ పరిచయం, ఎంచుకొన్న కథ ఏ స్కంధము లోనిది తెలిపి ప్రసంగమును  ప్రారంభించవచ్చు.
​​​​​ 7. మీ ఇంటర్నెట్ సరిగ్గా ఉందో లేదో ముందుగానే చూసుకోవాలి.
​​​​ 8. ప్రసంగం చేసే సమయంలో వీడియో తప్పక on చేసుకోవాలి.
​​​​ 9. సాంప్రదాయ దుస్తులు ధరించాలి.
​​​​ 10. పాల్గొనే వారి సాంప్రదాయాన్ని బట్టి బొట్టు లేక విభూతి తప్పక ధరించాలి.
​​​​ 11. న్యాయ నిర్ణేతలదే తుది తీర్పు.
Form closed. ఫారమ్ మూసివేయబడింది.
expand_less