Sep 29 2025సెప్టెంబరు 29 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 29 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం

తిథి: సప్తమి మ.2.37 కు తదుపరి అష్టమి 30 మ.3.29 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: మూల రా.3.11 కు తదుపరి పూర్వాషాఢ 01 తె.5.00 కు
యోగం: సౌభాగ్య రా.1:00 కు తదుపరి శోభన 30 రా.1:02 కు
కరణం: వణిజ సా.4.32 కు తదుపరి విష్టి తె.5.23 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ.12:30-1:17 కు, మ. 2:52-3:40 కు
వర్జ్యం: ఉ.9.51-11.35 కు & రా.1.27-3.11 కు
అమృతకాలం: రా.11.20-01.06 కు
సూర్యోదయం: ఉ. 5:50 కు
సూర్యాస్తమయం: సా. 6:07 కు

🕉️ శరన్నవరాత్రులు 8వ రోజు- ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో శ్రీ సరస్వతీదేవి అలంకారం 🕉️

గురుబోధ:
పరమపవిత్రమైన శ్రీ సరస్వతీమాతకు సంబంధించిన 108 నామాలను భక్తిశ్రద్ధలతో పఠించిన వారికి: 🕉️ సరస్వతీకటాక్షం లభిస్తుంది. 🕉️ తిరుగులేని పాండిత్యం వస్తుంది. 🕉️ వాక్శుద్ధి కలుగుతుంది. 🕉️వారి మాటకు అపజయం ఉండదు. 🕉️ ప్రతిదినం దీనిని విన్నవారు, పఠించినవారు పూర్తిగా సరస్వతీ కటాక్షం పొందుతారు. 🕉️ అందునా పంచమినాడు, అష్టమి, నవమి, ఏకాదశి వంటి తిథులలోనూ, శరన్నవరాత్రులలోనూ, అమావాస్యనాడు, ఈ సరస్వత్యష్టోత్తర శతనామావళిని భక్తితో చదివినవాడు, విన్నవాడు సాక్షాత్తు సరస్వతీ స్వరూపుడవుతాడు. 🕉️ భక్తులందరూ దీనిని స్వయంగా పఠించండి లేదా వినండి. 🕉️ మీ పిల్లలందరి చేత చదివించండి. 🕉️ పిల్లలకు ఈ అష్టోత్తర శతనామాలు కనుక కంఠస్థం వస్తే, ఇక వారి వంటి పండితులు మరొకరుండరు. 🕉️ అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం వారికి లభిస్తుంది.

సరస్వతీ కవచం👇
https://youtu.be/27tV-fDbMec?si=cpot-ev5PGqf1-VG
సరస్వతీ అష్టోత్తర శతనామాలు👇
https://youtu.be/2GRKLWvzdhY?si=NM_DfKMd-lKjppRa
శ్రీ మహాసరస్వతీ స్తవం👇
https://www.youtube.com/embed/shgLSotVAQs

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less