Sep 29 2023సెప్టెంబరు 29 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబరు 29 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం శుక్లపక్షము

తిథి : పూర్ణిమ సా. 04గం౹౹09ని౹౹ వరకు తదుపరి పాడ్యమి
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం : ఉత్తరాభాద్ర రా. 01గం౹౹17ని౹౹ వరకు తదుపరి రేవతి
యోగం : వృద్ధి రా. 08గం౹౹03ని౹౹ వరకు తదుపరి ధ్రువ
కరణం :  బవ మ. 03గం౹౹26ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹17ని౹౹ నుండి 09గం౹౹05ని౹౹ వరకు & మ. 12గం౹౹17ని౹౹ నుండి 01గం౹౹05ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 11గం౹౹45ని౹౹ నుండి 01గం౹౹15ని౹౹ వరకు
అమృతకాలం : రా. 08గం౹౹49ని౹౹ నుండి 10గం౹౹19ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹52ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹52ని౹౹కు

🕉️ భాద్రపద పూర్ణిమ - మహాలయ పూర్ణిమ, రాహు జయంతి 🕉️

గురుబోధ
1. పరీక్షిత్ మహారాజుకు శుకుడు భాగవతం భాద్రపద శుక్లపక్ష నవమి నుండి పూర్ణిమ వరకు శ్రీమద్భాగవతమును అందించాడు. అందుకే భాద్రపద పూర్ణిమనాడు భాగవత గ్రంథానికి పట్టాభిషేకం చేయడం ఆచారం. తప్పక ఈరోజు భాగవత గ్రంథాన్ని యథాశక్తి పూజించడం , శ్రవణం చేయడం లేదా కొన్ని శ్లోకాలు అయినా పారాయణం చెయ్యడం చేయాలి.  

2. మహాలయ పూర్ణిమనాడే పితృపక్షాలు మొదలవుతాయి. కావాల్సిన ఏర్పాట్లు ఈరోజు నుండే చేయాలి. కానీ కృష్ణపక్ష పాడ్యమి నుండి తర్పణాలు ఇవ్వటం శ్రాద్ధం పెట్టడం చేయాలి. 
3. పితృ పక్షాలు ( కృష్ణపక్ష పాడ్యమి నుండి అమావాస్య) పితృదేవతలకు పండుగ వంటివి. ఈ 15 రోజులు పితృదేవతల ప్రీత్యర్థం పితృదేవతా స్తోత్రం, యమ కృత శివకేశవ అష్టోత్తరము చేయడం మంచిది.
4. మరణించిన వారి తిథి శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా ఈ 15 రోజులలో వచ్చే  తిథి నాడు  పితృ కార్యక్రమాలు నిర్వహించడం, తర్పణాలు ఇవ్వడం చేయాలి. 
5. ఉదా|| ఒక వ్యక్తి శుక్లపక్ష నవమి నాడు స్వర్గస్తులైతే వారికి   మహాలయ పక్షంలో వచ్చే నవమి నాడు శ్రాద్ధము పెట్టడం  చేయాలి. 

6. పితృకార్యాలు జరిగేప్పుడు తప్పక హరివంశం లోని బ్రహ్మ దత్తుని కథని వినాలి. 
7. రాహుగ్రహ ధ్యాన శ్లోకం : అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం                      
             సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం.




expand_less