కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 28 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం
తిథి: షష్ఠి మ.12.27 కు తదుపరి సప్తమి 29 మ.2.37 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: జ్యేష్ఠ రా.1.12 కు తదుపరి మూల 29 రా.3.11 కు
యోగం: ఆయుష్మాన్ రా.12:31 కు తదుపరి సౌభాగ్య 29 రా.1:00 కు
కరణం: తైతుల మ.2.27 కు తదుపరి గరజి తె.3.33 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.4:28-5:16 కు
వర్జ్యం: తె.4.37-ఉ.6.43 కు
అమృతకాలం: సా.6.06-రా.7.52 కు
సూర్యోదయం: ఉ. 5:50 కు
సూర్యాస్తమయం: సా. 6:07 కు
🕉️ శరన్నవరాత్రులు 7వ రోజు- ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో శ్రీ వారాహీదేవి అలంకారం 🕉️
గురుబోధ:
అత్యంత పవిత్రమైన వారాహీకవచాన్ని నిత్యం భక్తిశ్రద్ధలతో వినడం సర్వశుభకరం. ముఖ్యంగా ఆపదలు వచ్చినప్పుడు వినడం వలన వాటి నుండి బయటపడతారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి మొదలుకుని నవమి వరకు వచ్చే వారాహీనవరాత్రులలో ఈ కవచాన్ని మూడుపూటలా వింటే ఎటువంటి శత్రువైనా నశించి, సర్వకార్యదిగ్విజయం లభిస్తుంది అని స్కాందపురాణంలో దేవీభాగవత మాహాత్మ్యంలో ఉంటుంది. ఆశ్వయుజ మాసం, చైత్ర మాసం, ఆషాఢ మాసం, మాఘమాసం అనే 4 మాసాలలో వచ్చే నవరాత్రులలో (శుక్లపక్షం పాడ్యమి నుండి నవమి వరకు) వినడం, అమ్మవారి సేవ చేసుకోవడం ఎంతో మంచిది. ముఖ్యంగా అషాఢమాసంలో వినడం వలన ఎక్కువ ఫలితం వస్తుంది. శత్రుపీడ పెరిగిపోయినప్పుడు, అపనిందలు మీద పడుతున్నప్పుడు, కీర్తి తొలగి అప్రతిష్ఠ వస్తున్నప్పుడు, దంపతుల మధ్య భేదాలు వస్తున్నప్పుడు, దొంగల భయం, అగ్ని భయం ఉన్నప్పుడు, కొనుక్కున్న వస్తువు మనకి దక్కనప్పుడు, 3 పూటాలా ఈ కవచాన్ని వింటే కష్టాలన్నీ తొలగి అనుకున్న పనులు అవుతాయి, వారాహీమాత రక్షణ మనకు ఎల్లప్పుడూ లభిస్తుంది.
https://youtu.be/ECa8o_0ig1k?si=S8Tn7JHKsH074fBq
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial