Sep 28 2024సెప్టెంబరు 28 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 28 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం

తిథి: ఏకాదశి సా. 4.43 కు తదుపరి ద్వాదశి 29 సా. 5.37 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: ఆశ్లేష 29 ఉ. 05.55 కు తదుపరి మఘ
యోగం: సిద్ధ రా. 11.51 కు తదుపరి సాధ్య రా. 12.28 కు
కరణం: బాలవ మ. 02.49 కు తదుపరి కౌలవ రా. 03.45 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: తె. 06.06 - 07.42 కు
వర్జ్యం: రా. 6.10 - 7.51 కు
అమృతకాలం: తె. 4.16 - 5.46 కు
సూర్యోదయం: ఉ. 6.06 కు
సూర్యాస్తమయం: సా. 6.07 కు

శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=P3uhz2umkoo8lmNX

🕉️ భాద్రపద కృష్ణ ఏకాదశి 🕉️

ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ రేపు చేయాలి.

గురుబోధ:
శ్రాద్ధ భోజనానికి వేటితో వండితే పితృదేవతలు మరింత సంతోషిస్తారు ? స్వయంపాకమునకు (కూరగాయలు, వంట సామగ్రి మొ౹౹) ఏవేవి దానం చేస్తే మంచిది? పితృదేవతలకి ఆవపిండితో చేసిన వంటలు, నువ్వులుతో వంటలు,  గోధుమలతో చేసిన అప్పాలు, పెసర, మినపపప్పుతో వంటలు వండడం లేదా ఇవి దానాలు చేయడం వల్ల పితృదేవతలు తృప్తి పడతారు. స్వయంపాకమునకు కందగడ్డ, చామగడ్డ, తోటకూర, బెల్లం, చింతపండు, బెండ, కాకర, పనసకూర,  ఎండుమిరప, ఆవాలు, ఆవు నెయ్యి, పంచకదళి (అరటికాయ, అరటిపండు, అరటిపువ్వు, అరటి దూట, అరటి ఆకు), పాలు, పెరుగు, నల్ల మినపపప్పు,పెసరపప్పు, అల్లం, చెరకు రసం మొదలైనవి.

expand_less