Sep 27 2026సెప్టెంబరు 27 2026favorite_border

కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 27 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం

తిథి: బ.పాడ్యమి రా.9.12 కు తదుపరి విదియ 28 రా.8.05 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర ప.12.15 కు తదుపరి రేవతి 28 ప.11.58 కు
యోగం: వృద్ధి ఉ.11:16 కు తదుపరి ధ్రువ 28 ఉ.8:53 కు
కరణం: బాలవ ఉ.9:42 కు, కౌలవ రా.8:59 కు తదుపరి తైతుల 28 ఉ. 08.09 కు
రాహుకాలం: సా. 04.30 – 06.00 కు
దుర్ముహూర్తం: సా. 4.29 – 5.17 కు
వర్జ్యం: రా.12.06 – 1.41 కు
అమృతకాలం: ఉ. 06.25 – 07.59 కు
సూర్యోదయం: ఉ. 6.09 కు
సూర్యాస్తమయం: సా. 6.04 కు

🕉️ మహాలయ పక్షారంభము (పితృపక్షములు) 🕉️

గురుబోధ:
🕉️భాద్రపదమాసంలో పూర్ణిమ తరువాత వచ్చే పాడ్యమి మొదలుకుని అమావాస్య వరకు ఉండే 15 రోజులను మహాలయపక్షము లేదా పితృ పక్షం అంటారు. ఈ 15 రోజులలో చనిపోయిన వారి తిథిని బట్టి శ్రాద్ధం నిర్వహిస్తే అది గయాశ్రాద్ధంతో సమానము.
🕉️పితృకార్యక్రమాలు జరుగుతున్నప్పుడు తెలిసీ తెలియక ఏవైనా పొరపాటులు జరిగినా దోషం రాకుండా ఉండడానికి, పితృకార్యక్రమం అక్షయఫలితం ఇవ్వడానికి ,పితృదేవతల సంతృప్తి కొరకు తప్పక పితృస్తవమును పారాయణము (మార్కండేయ పురాణం లోని స్తోత్రం) చేయాలి.
🕉️పితృ తర్పణం ఇచ్చేటప్పుడు తప్పక 5 ఉండాలి.

  1. నువ్వులు 2. నీరు. 3. దర్భ 4. తులసీ దళం 5. శ్రద్ధ
    🕉️ఉప్పు, ప్రత్తి, ఇనుము, గేదె నెయ్యి వంటి వస్తువులు మహాలయ పక్షములలో దానం చేస్తే వారి వంశంలో లేమి, దారిద్ర్యం ఎప్పటికీ ఉండదు. – గరుడపురాణం

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less