Sep 27 2025సెప్టెంబరు 27 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 27 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం

తిథి: పంచమి ఉ.10.28 కు తదుపరి షష్ఠి 28 మ.12.27 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: అనూరాధ రా.10.46 కు తదుపరి జ్యేష్ఠ 28 రా.1.12 కు 28
యోగం: ప్రీతి రా.11.45 కు తదుపరి ఆయుష్మాన్ 28 రా.12:31 కు
కరణం: బాలవ మ.12.04 కు తదుపరి కౌలవ రా.01.17 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.7:44-8:32 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: మ.1:26-3:14 కు
సూర్యోదయం: ఉ. 5:50 కు
సూర్యాస్తమయం: సా. 6:07 కు

🕉️ శరన్నవరాత్రులు 6వ రోజు- ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో శ్రీ మంగళగౌరీదేవి అలంకారం 🕉️

గురుబోధ:
శ్రీ లలితాత్రిశతీ స్తోత్రం అమ్మవారి 300 నామములతో ఉండే సాక్షాత్తు జగన్మాత దివ్యస్వరూపం. సృష్టిలో ఉన్న ఏడు కోట్ల మంత్రములలో పంచదశీ అనేది ఒక మహామంత్రం. ఈ మహామంత్రమును 300 నామములుగా హయగ్రీవుడు అగస్త్యునికి బోధించాడు. వాగ్దేవతలు స్వయంగా రచించిన దివ్యస్తోత్రములలో ఇది కూడా ఒకటి. అమ్మవారి 300 దివ్యనామములతో ఈ అపూర్వ స్తోత్రం కామేశ్వరుని, కామేశ్వరి యొక్క అలాగే అర్ధనారీశ్వర తత్త్వమును తెలియజేస్తుంది. భక్తిశ్రద్ధలతో విన్నా, పారాయణం చేసుకున్నా అద్భుత ఫలితాలు సిద్ధిస్తాయి.
శ్రీ లలితాత్రిశతి👇
https://youtu.be/FS-o_aSJRd0?si=sPMIR7Xwmug4AEV6

expand_less