Sep 27 2024సెప్టెంబరు 27 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 27 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం

తిథి: దశమి సా. 4.19 కు తదుపరి ఏకాదశి 28 సా. 4.43 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: పుష్యమి 28 తె. 4.46 కు తదుపరి ఆశ్లేష
యోగం: శివ రా. 11.34 కు తదుపరి సిద్ధ రా. 11.51 కు
కరణం: విష్టి మ. 01.20 కు తదుపరి బవ రా. 02.01 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.30 - 09.18 కు & మ. 12.31 - 01.19 కు
వర్జ్యం: మ. 12.14 - 1.53 కు
అమృతకాలం: రా. 10.00 - 11.39 కు
సూర్యోదయం: ఉ. 6.06 కు
సూర్యాస్తమయం: సా. 6.08 కు

గురుబోధ:
పితృదేవతలు - 7 గణములు - వీరి నామస్మరణ వలన సకల పాపాలు తొలగుతాయి. పితృదోషాలు తొలగుతాయి. వంశం వృద్ధి చెందుతుంది. శ్రాద్ధసమయంలో తప్పక వీరిని స్మరించాలని శాస్త్రం. 1. వైరాజుడు 2. అగ్నిష్వాత్తుడు 3. బర్హిషదుడు 4. సుకాలుడు 5. అంగిరసుడు 6. సుస్వధుడు 7. సోమపుడు

expand_less