" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 సెప్టెంబర్ 27 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షము తిథి : విదియ రాత్రి 02గం౹౹52ని౹౹ వరకు తదుపరి తదియ వారం : భౌమవారం (మంగళవారం) నక్షత్రం : హస్త ఈ రోజు ఉదయం 07గం౹౹28ని౹౹ వరకు తదుపరి చిత్త యోగం : బ్రహ్మ ఈ రోజు ఉదయం 06గం౹౹44ని౹౹ వరకు తదుపరి ఐంద్ర కరణం : బాలవ ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹51ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉదయం 08గం౹౹16ని౹౹ నుండి 09గం౹౹04ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹39ని౹౹ నుండి 11గం౹౹27ని౹౹ వరకు వర్జ్యం : మధ్యాహ్నం 03గం౹౹30ని౹౹ నుండి 05గం౹౹06ని౹౹ వరకు అమృతకాలం : రాత్రి 01గం౹౹08ని౹౹ నుండి 02గం౹౹44ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹52ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹52ని౹౹ గురుబోధ శ్రీ మద్దేవీభాగవత గ్రంథములో 12 స్కంధములు మొత్తం పారాయణము చేయలేని, వారు కనీసం 9వ స్కంధం అయినా పారాయణము చేసుకోవచ్చు, అది సకల పుణ్యప్రదం, సర్వ శుభదాయకం.