కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 26 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం
తిథి: పూర్ణిమ రా.9.53 కు తదుపరి బ.పాడ్యమి 27 రా.9.12 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: పూర్వాభాద్ర ప.12.04 కు తదుపరి ఉత్తరాభాద్ర 27 ప.12.15 కు
యోగం: గండ మ.1:17 కు తదుపరి వృద్ధి 27 ఉ.11:16 కు
కరణం: విష్టి ఉ.10:47 కు, బవ రా.10:19 కు తదుపరి బాలవ 27 ఉ.9:42 కు
రాహుకాలం: ఉ. 09.00 – 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 7.44 – 8.32 కు
వర్జ్యం: రా.9.44 – 11.21 కు
అమృతకాలం: లేదు
సూర్యోదయం: ఉ. 6.09 కు
సూర్యాస్తమయం: సా. 6.05 కు
🕉️ భాద్రపదపూర్ణిమ, శ్రీమద్ భాగవత గ్రంథపూజ, రాహుజయంతి 🕉️
గురుబోధ:
- పరీక్షిత్ మహారాజుకు శుకుడు భాగవతం భాద్రపద శుక్లపక్ష నవమి నుండి పూర్ణిమ వరకు శ్రీమద్భాగవతమును అందించాడు. అందుకే భాద్రపద పూర్ణిమనాడు భాగవత గ్రంథానికి పట్టాభిషేకం చేయడం ఆచారం. తప్పక ఈరోజు భాగవత గ్రంథాన్ని యథాశక్తి పూజించడం , శ్రవణం చేయడం లేదా కొన్ని శ్లోకాలు అయినా పారాయణం చెయ్యడం చేయాలి.
- మహాలయ పూర్ణిమనాడే పితృపక్షాలు మొదలవుతాయి. కావాల్సిన ఏర్పాట్లు ఈరోజు నుండే చేయాలి. కానీ కృష్ణపక్ష పాడ్యమి నుండి తర్పణాలు ఇవ్వటం శ్రాద్ధం పెట్టడం చేయాలి.
- పితృ పక్షాలు ( కృష్ణపక్ష పాడ్యమి నుండి అమావాస్య) పితృదేవతలకు పండుగ వంటివి. ఈ 15 రోజులు పితృదేవతల ప్రీత్యర్థం పితృదేవతా స్తోత్రం, యమ కృత శివకేశవ అష్టోత్తరము చేయడం మంచిది.
- మరణించిన వారి తిథి శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా ఈ 15 రోజులలో వచ్చే తిథి నాడు పితృ కార్యక్రమాలు నిర్వహించడం, తర్పణాలు ఇవ్వడం చేయాలి.
- ఉదా|| ఒక వ్యక్తి శుక్లపక్ష నవమి నాడు స్వర్గస్తులైతే వారికి మహాలయ పక్షంలో వచ్చే నవమి నాడు శ్రాద్ధము పెట్టడం చేయాలి.
- పితృకార్యాలు జరిగేప్పుడు తప్పక హరివంశంలోని బ్రహ్మదత్తుని కథని వినాలి.
- రాహుగ్రహ ధ్యాన శ్లోకం : అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనమ్ |
సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ||