కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 26 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం
తిథి: చతుర్థి ఉ.8.05 కు తదుపరి పంచమి 27 ఉ.10.28 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: విశాఖ రా.8.12 కు తదుపరి అనూరాధ 27 రా.10.46 కు
యోగం: విష్కంభ రా.10:50 కు తదుపరి ప్రీతి 27 రా.11.45 కు
కరణం: విష్టి ఉ.8.33 కు తదుపరి బవ రా.10.49 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.8:32-9:20 కు, మ. 12:31-1:18 కు
వర్జ్యం: రా.12.36-2.22 కు
అమృతకాలం: మ.12:14-02:03 కు
సూర్యోదయం: ఉ. 5:50 కు
సూర్యాస్తమయం: సా. 6:07 కు
🕉️ శరన్నవరాత్రులు 5వ రోజు- ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం 🕉️
గురుబోధ:
అగస్త్యుడు లోపాముద్రాసమేతంగా కరవీరపురం (కోలాపురం/కొల్హాపురం) చేరి మంగళదేవత, మంగళస్వరూపిణి, విష్ణువు యొక్క హృదయపద్మంలో ఉంటూ తెల్లని, బంగారురంగుతో ఉండే శ్రీమహాలక్ష్మిని చేసిన గొప్ప స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో విన్నవారు ఎంత దరిద్రులైనా ఐశ్వర్యవంతులవుతారు. ఒక 40 రోజులు విడిచిపెట్టకుండా చదివినా, శ్రవణం చేసినా వారి ఇంట్లో నేను కొలువై ఉంటాను అని శ్రీ మహలక్ష్మీదేవి వరమిచ్చింది.
https://youtu.be/yUXkM_QhZgA?si=rxRczXo7KjzzyUI8
ఇంద్రకృత లక్ష్మీస్తోత్రం👇
https://youtu.be/if5zzw20GaQ?si=J-1M6WexyB1maJZH
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial