Sep 26 2024సెప్టెంబరు 26 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 26 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం

తిథి: నవమి సా. 4.25 కు తదుపరి దశమి 27 సా. 4.19 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: పునర్వసు 27 తె. 1.59 కు తదుపరి పుష్యమి 28 తె. 4.46 కు
యోగం: పరిఘ రా. 11.41 కు తదుపరి శివ రా. 11.34 కు
కరణం: గరజి మ. 12.25 కు తదుపరి వణిజ రా. 12.48 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.07 - 10.55 కు & మ. 02.56 - 03.44 కు
వర్జ్యం: మ. 3.49 - 5.26 కు
అమృతకాలం: రా. 1.20 - 2.57 కు
సూర్యోదయం: ఉ. 6.06 కు
సూర్యాస్తమయం: సా. 6.09 కు

🕉️ అవిధవా నవమి 🕉️

గురుబోధ:
పితృకార్యం చెయ్యవలసిన తిథి నాడు అశౌచం/అవాంతరం వస్తే (మైల, పురుడు వంటివి) ఈ మూడు విధానాలలో ఏదో ఒక దానిని పితృకార్యం చేసేందుకు పాటించవచ్చు. 1. శుద్ధి రోజు చెయ్యవచ్చు ; 2. ఆ నెల అమావాస్య రోజు చేయవచ్చు ; 3. వచ్చే నెల అదే తిథినాడు చేయవచ్చు.

expand_less