Sep 26 2023సెప్టెంబరు 26 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబరు 26 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం శుక్లపక్షము

తిథి : ద్వాదశి రా. 11గం౹౹14ని౹౹ వరకు తదుపరి  త్రయోదశి
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం : శ్రవణం ఉ. 07గం౹౹45ని౹౹ వరకు తదుపరి ధనిష్ఠ
యోగం : సుకర్మ ఉ. 11గం౹౹46ని౹౹ వరకు తదుపరి ధృతి
కరణం :  బవ మ. 03గం౹౹25ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹16ని౹౹ నుండి 09గం౹౹04ని౹౹ వరకు & రా. 10గం౹౹40ని౹౹ నుండి 11గం౹౹28ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 11గం౹౹28ని౹౹ నుండి 12గం౹౹57ని౹౹ వరకు
అమృతకాలం : రా. 08గం౹౹26ని౹౹ నుండి 09గం౹౹55ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹52ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹53ని౹౹కు

🕉️ వామన జయంతి 🕉️

👉🏻🕉️ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈ రోజు ఉదయం చేయవచ్చును.

వామన పురాణం👇


వామన చరిత్ర👇


గురుబోధ
శ్రీమహావిష్ణువు వామనునిగా మధ్యాహ్నం పూట అభిజిత్ లగ్నంలో ఉద్భవించాడు. అనగా ద్వాదశీ తిథి ఉదయం 11.45 గం.ల నుండి మధ్యాహ్నం 12.30 గం.ల మధ్యలో ఉన్నప్పుడే వామనజయంతి చేసుకోవాలి. ఈనాడు భక్తిశ్రద్ధలతో శ్రీమహావిష్ణువును పూజించి విష్ణ్వాలయంలో ప్రదక్షిణలు చేయాలి. విష్ణువుకు ప్రీతికరమైన చామంతులతో కానీ, మల్లెపూవులతో కానీ, ఏవైనా పసుపుపచ్చని పువ్వులతో కానీ పూజచేస్తే చాలా మంచిది. భూదానం చేసుకోవాలనుకొనేవారు ఈరోజు చేసుకోవడం సర్వశుభకరం.

expand_less