కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 25 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం
తిథి: చతుర్దశి రా.10.05 కు తదుపరి పూర్ణిమ 26 రా.9.53 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: శతభిషం ఉ.11.23 కు తదుపరి పూర్వాభాద్ర 26 ప.12.04 కు
యోగం: శూల 25 మ.2:50 కు తదుపరి గండ 26 మ.1:17 కు
కరణం: *గరజి ఉ.11:09 కు, వణిజ రా.11:07 కు తదుపరి విష్టి ఉ.10:47 కు
రాహుకాలం: ఉ. 10.30 – 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 8.32 – 9.20 కు, మ. 12.31 – 1.19 కు
వర్జ్యం: సా.5.58 – 7.36 కు
అమృతకాలం: తె. 03.23 – 05.00 కు
సూర్యోదయం: ఉ. 6.09 కు
సూర్యాస్తమయం: సా. 6.06 కు
🕉️ శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం – భాద్రపద శుక్లచతుర్దశి🕉️
గురుబోధ:
- శ్రీ మహావిష్ణువు అనంతపద్మనాభుడు అనే పేరుతో శయనించిన తిథి. అదే రూపం ఇప్పటికి కూడా వివిధ ఆలయాల్లో కనబడుతోంది. 2) ఈ రోజు విష్ణువును, విష్ణుసహస్రనామంతో కాని లేదా అష్టోత్తర శతనామములతో కాని పూజించడం సర్వశుభకరం. 3) దానధర్మాలు మనకి తోచినట్లుగా చేసుకోవచ్చు.