Sep 24 2023సెప్టెంబరు 24 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబరు 24 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం శుక్లపక్షము

తిథి : నవమి ఉ. 05గం౹౹56ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం : పూర్వాషాఢ ఉ. 10గం౹౹38ని౹౹ వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం : శోభన రా. 06గం౹౹40ని౹౹ వరకు తదుపరి అతిగండ
కరణం :  కౌలవ  ఉ. 10గం౹౹23ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹19ని౹౹ నుండి 05గం౹౹07ని౹౹ వరకు 
వర్జ్యం : రా. 06గం౹౹11ని౹౹ నుండి 07గం౹౹41ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 06గం౹౹03ని౹౹ నుండి 07గం౹౹34ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹52ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹53ని౹౹కు

గురుబోధ
శ్లో|| గణేశం ఏకదంతంచ హేరంబం విఘ్ననాయకం |
లంబోదరం శూర్పకర్ణం గజవక్త్రం గుహాగ్రజం ||
క్షిప్రగణపతి ఉపాసన ముక్తినిస్తుంది. విఘ్ననాయక అంటే హఠాత్తుగా తెలియకుండా వచ్చే ఆపదలను పొగోట్టేవాడని అర్థం, ఆదివారం విఘ్నేశ్వరుడ్ని బిల్వపత్రాలతో “ఓం వం విఘ్ననాయకాయ నమః” అనే మంత్రాన్ని ఎంత ఎక్కువ జపిస్తే, విపత్తుల నుండి కాపాడబడుతాము.


గణపతి నవరాత్రుల సందర్భంగా శ్రీ సంపూర్ణ గణేశ పురాణం👇


expand_less