" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 సెప్టెంబర్ 24 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షము తిథి : చతుర్దశి రాత్రి 02గం౹౹46ని౹౹ వరకు తదుపరి అమావాస్య వారం : స్థిరవారం (శనివారం) నక్షత్రం : పుబ్బ ఈ రోజు పూర్తిగా ఉంది యోగం : సాధ్య ఈ రోజు ఉదయం 09గం౹౹43ని౹౹ వరకు తదుపరి శుభ కరణం : విష్టి ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹55ని౹౹ వరకు తదుపరి శకుని రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉదయం 06గం౹౹32ని౹౹ నుండి 07గం౹౹28ని౹౹ వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12గం౹౹52ని౹౹ నుండి 02గం౹౹32ని౹౹ వరకు అమృతకాలం : రాత్రి 11గం౹౹03ని౹౹ నుండి 12గం౹౹45ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹52ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹53ని౹౹ 👉🏻🕉️మాస శివరాత్రి🕉️ గురుబోధ పితృకార్యాలు -- సందేహాలు -- ధర్మసూక్ష్మములు 1. శ్రాద్ధం నాడు ఎందుకు ఇంటిముందు ముగ్గు వేయరాదు? ఒకవేళ తోరణాలు ఉంటే ఎందుకు తీసేయాలి? పితృకార్యాలు జరిగే ఇంటిలో భోక్తలు, పురోహితుడు తప్ప అతిథి, భిక్ష చేసేవారు, ఇతర సన్నిహితులు ఇంటికి వస్తే పితృకార్యానికి ఇబ్బంది ఏర్పడవచ్చు. అందుకే పితృకార్యం ఆ ఇంటిలో ఆ రోజు ఉందని తెలియటానికి ఇంటి ముందు ముగ్గు వేయకూడదు, ఒకవేళ తోరణాలు ఉంటే తీసేయాలి అంటారు. 2. శ్రాద్ధం నాడు దేవతా పూజ చేయకూడదా ? శాస్త్రం ఏమి చెప్పింది? దేవతల పుత్రులలో కొందరు దేవతల కంటే అధిక జ్ఞానము పొంది దేవతల చేత పూజింపబడ్డారు. వారిని పితృదేవతలు అంటారు. పితృకార్యాలు చేసేటప్పుడు తప్పక ఆ ఇంటిలో దేవతాపూజ చేసిన తరువాతనే పితృపూజ చేయాలని గరుడపురాణం, మార్కండేయ పురాణం మొదలైనవి చెపుతున్నాయి అందుకు ప్రమాణంగా రుచి అనే ప్రజాపతి అందించిన పితృస్తవం(పితృస్తోత్రం) లో 26 వ శ్లోకం - "యే దేవపూర్వాణ్యతి తృప్తిహేతోః అశ్నంతి కవ్యాని శుభాహుతాని" | ఆ శ్లోకము ప్రకారం దేవతాపూజ చేసిన తర్వాత పితృకార్యాలు చేసేవారిని పితృదేవతలు సంపూర్ణంగా అనుగ్రహిస్తారని అర్థం వస్తుంది. శ్రాద్ధం పెట్టే యజమాని ఇంటిలో పూజకు ఎక్కువ సమయం కేటాయిస్తే ముఖ్యమైన శ్రాద్ధ కార్యముకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అందుకే సంధ్యావందనం, దేవతా పూజ, జపం చిన్నగా (కొద్దిసమయంలో) చేసి ముగించాలి. కర్తకు పూజ చేసే సమయం లేనప్పుడు ఇతరులచేత పూజ చేయించవచ్చు. 3. శ్రాద్ధ దినమునున శ్రాద్ధకార్యం ముగించకుండా దానం, స్వయంపాకం, భిక్ష ఇవ్వడం, దేవతలకు మహా నైవేద్యం పెట్టడం, గోవుకు గ్రాసం ఇవ్వడం వంటివి చేయరాదా? ఎందుకు? పితృదేవతలు ఏ రూపంలో అయినా వచ్చి కర్త దగ్గర దానం, భిక్ష లేదా స్వయంపాకం తీసుకుని తృప్తి పడి వెళ్ళిపోవచ్చు. అప్పుడు శ్రాద్ధ కార్యం నిష్ఫలం అవుతుంది. అందుకే వాటిని శ్రాద్ధం పెట్టే యజమాని చేయకూడదు. ఇతరులచేత పైవన్నీ చేయించవచ్చు. శ్రాద్ధం పూర్తి అయ్యాక యజమాని పైవన్నీ చేయవచ్చు.