కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 23 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం
తిథి: షష్ఠి రా. 7.32 కు తదుపరి సప్తమి
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: రోహిణి 24 తె. 4.26 కు తదుపరి మృగశిర
యోగం: సిద్ధి రా. 03.10 కు తదుపరి వ్యతీపాత
కరణం: వణిజ మ. 01.50 కు తదుపరి విష్టి
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.32 - 01.21 కు & మ. 02.58 - 03.46 కు
వర్జ్యం: రా. 8.45 - 9.17 కు
అమృతకాలం: రా. 2.04 - 3.36 కు
సూర్యోదయం: ఉ. 6.05 కు
సూర్యాస్తమయం: సా. 6.11 కు
గురుబోధ:
సూర్యోదయానికి ముందే ప్రతి ఇంటి గడప ముందు రంగవల్లులు (ముగ్గులు) ఉంటే ఆ ఇంటికి లక్ష్మీ అనుగ్రహం ఉంటుందని మరియు ముగ్గు వేయడం ద్వారా దేవతలని ఇంటికి ఆహ్వానించినట్లు అని పెద్దల మాట. కానీ పితృదేవతలను ఆహ్వానించే రోజులలో శ్రాద్ధ కర్మలు నిర్వహించే రోజులలో మాత్రం ఇంటి ముందు ముగ్గు వేయరాదు.