Sep 23 2023సెప్టెంబర్ 23 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబర్ 23 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం వర్ష ఋతువు  
భాద్రపదమాసం కృష్ణపక్షము 

తిథి : త్రయోదశి రాత్రి 01గం౹౹41ని౹౹ వరకు తదుపరి చతుర్ధశి
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం : మాఘ  తెల్లవారి 04గం౹౹19ని౹౹ తదుపరి పుబ్బ
యోగం :  సిద్ధ ఈ రోజు ఉదయం 09గం౹౹56ని౹౹ వరకు తదుపరి సాధ్య
కరణం : గరజి ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹57ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 8గం౹౹17ని౹౹ నుండి 09గం౹౹05ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹18ని౹౹ నుండి 01గం౹౹07ని౹౹ వరకు 
వర్జ్యం : మధ్యాహ్నం 03గం౹౹18ని౹౹ నుండి 05గం౹౹02ని౹౹ వరకు
అమృతకాలం :  రాత్రి 01గం౹౹42ని౹౹ నుండి 03గం౹౹26ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹52ని౹౹ 
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹55ని౹౹


గురుబోధ

ప్రతి సంవత్సరము పితృతర్పణములు 96 పర్వదినములలో ఇవ్వడం మంచిదని ధర్మశాస్త్రం. దానినే షన్నావతి శ్రాద్ధం లేదా తర్పణ పుణ్యకాలం అంటారు.   అవి
12 అమావాస్యలు, 12 సంక్రమణలు, 14 మన్వంతరములు
4 ఉగాదులు (కృత, త్రేత, ద్వాపర, కలి ఉగాదులు) - మాఘ అమావాస్య, భాద్రపద కృష్ణ త్రయోదశి, వైశాఖ శుక్ల తృతీయ, కార్తిక శుక్ల నవమి)
వైధృతి కరణములు - 13
వ్యతీపాత యోగములు - 13 
మహాలయ పక్షములు, అష్టక శ్రాద్ధములు 
(మార్గశీర్షం,  పుష్యం, మాఘం , ఫాల్గునం  - బహుళ(కృష్ణ) పక్షం సప్తమి, అష్టమి, నవమి) వంటి పర్వదినములలో చేయడం వలన పితృదేవతల అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది.


expand_less