"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 23 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం శుక్లపక్షము
తిథి : అష్టమి ఉ. 07గం౹౹41ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం : మూల ఉ. 11గం౹౹43ని౹౹ వరకు తదుపరి పూర్వాషాఢ
యోగం : సౌభాగ్య రా. 09గం౹౹31ని౹౹ వరకు తదుపరి శోభన
కరణం : బవ మ. 12గం౹౹17ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 05గం౹౹58ని౹౹ నుండి 07గం౹౹28ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 10గం౹౹10ని౹౹ నుండి 11గం౹౹42ని౹౹ వరకు & రా. 08గం౹౹53ని౹౹ నుండి 10గం౹౹24ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 05గం౹౹34ని౹౹ నుండి 07గం౹౹04ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹52ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹54ని౹౹కు
రాధాష్టమిగురుబోధ
శ్లో|| గణేశం ఏకదంతంచ హేరంబం విఘ్ననాయకం |
లంబోదరం శూర్పకర్ణం గజవక్త్రం గుహాగ్రజం ||
ఎన్నో వేలజన్మల సంస్కారం పుణ్యం ఉంటే గాని తీర్థయాత్రలు చేయలేము. పైగా సద్గురువులతో యాత్ర చేసేభాగ్యం మరింత అదృష్టం. అటువంటి పుణ్య ప్రదేశాలలో ఇతరుల పై చాడీలు చెప్పడం, కోపపడడం, ఏదో ఒక వంక పెట్టి అసంతృప్తి వ్యక్తపరచడం, విరుచుకు పడడం చేయరాదు. సాధ్యమైనంత వరకు ఎదో ఒక జప, పారాయణం, పురాణ శ్రవణంతో కాలం గడపాలి.
శూర్పకర్ణుడు - చాటలవంటి చెవులు ఉన్నవాడని అర్థం. జ్ఞానం, సంపద ఇస్తాడు. కొండెముల ద్వారా వచ్చే పాపదోషాలు తొలగిస్తాడు. “ఓం సం శూర్పకర్ణాయ నమః” అన్ని వేళల్లో జపించాల్సిన మంత్రం.
గణపతి నవరాత్రుల సందర్భంగా శ్రీ సంపూర్ణ గణేశ పురాణం👇