కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 22 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం
తిథి: పంచమి రా. 9.21 కు తదుపరి షష్ఠి
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: భరణి ఉ. 6.32 కు తదుపరి కృత్తిక
యోగం: హర్షణ ఉ. 08.18 కు తదుపరి వజ్ర
కరణం: తైతుల మ. 03.43 కు తదుపరి గరజి
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 04.35 - 05.24 కు
వర్జ్యం: సా. 5.57 - 7.28 కు
అమృతకాలం: రా. 2.56 - 4.26 కు
సూర్యోదయం: ఉ. 6.05 కు
సూర్యాస్తమయం: సా. 6.12 కు
గురుబోధ:
మహాలయపక్షాలు లేదా పితృపక్షాలు పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైన రోజులు, పితృదేవతల అనుగ్రహాన్ని విశేషంగా ప్రసాదించే రోజులు. మన పేరు మీద, మన పిల్లలు లేదా పెద్దల పేరు మీద లేదా స్వర్గస్తులైన వారి పేరు మీద చేసే గోసేవ వల్ల పితృదేవతలు సంతోషించి ఆ వంశాన్ని సంపూర్ణంగా ఆశీర్వదిస్తారు.