Sep 22 2023సెప్టెంబరు 22 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబరు 22 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం శుక్లపక్షము

తిథి : సప్తమి ఉ. 09గం౹౹06ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం : జ్యేష్ఠ మ. 12గం౹౹29ని౹౹ వరకు తదుపరి మూల
యోగం : ఆయుష్మాన్ రా. 11గం౹౹53ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య
కరణం :  వణిజ మ. 01గం౹౹35ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹17ని౹౹ నుండి 09గం౹౹05ని౹౹ వరకు & మ. 12గం౹౹19ని౹౹ నుండి 01గం౹౹07ని౹౹ వరకు 
వర్జ్యం : రా. 08గం౹౹13ని౹౹ నుండి 09గం౹౹46ని౹౹ వరకు
అమృతకాలం : తె. 04గం౹౹01ని౹౹ నుండి 05గం౹౹31ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹52ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹57ని౹౹కు

గురుబోధ
శ్లో|| గణేశం ఏకదంతంచ హేరంబం విఘ్ననాయకం |
లంబోదరం శూర్పకర్ణం గజవక్త్రం గుహాగ్రజం ||

లంబోదరం - లం అంటే భూతత్త్వం. ఒకప్పుడు గణేశుడు బ్రహ్మాండాన్ని మ్రింగి, చెవి నుంచి వదిలాడు. శివకేశవులు పెట్టిన (సృష్టి, సంహారాలే) నైవేద్యములవల్ల, సరస్వతీదేవి ఇచ్చిన జ్ఞానం, విద్యలు కడుపులో మింగ్రినందున పొట్టపెరిగి లంబోదరుడయ్యాడు శుక్రవారం “ఓం లం లంబోదరాయ నమః” అని జపించిన వారికి జ్ఞానం, విద్య విశేషంగా లభిస్తుంది.

గణపతి నవరాత్రుల సందర్భంగా శ్రీ సంపూర్ణ గణేశ పురాణం👇


expand_less