Sep 21 2025సెప్టెంబరు 21 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 21 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం

తిథి: భాద్రపద అమావాస్య రా.2.02 కు తదుపరి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి 22 రా.3.02 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: పుబ్బ ఉ.9.54 కు తదుపరి ఉత్తర 22 ఉ.11.12 కు
యోగం: శుభ రా.7:52 కు తదుపరి శుక్ల 22 రా.7:58 కు
కరణం: చతుష్పాద మ.12.47 కు తదుపరి నాగ రా.1.24 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.4:33-5:21 కు
వర్జ్యం: సా.5.30-7.11 కు
అమృతకాలం: తె.3.38-5.22 కు
సూర్యోదయం: ఉ. 5:50 కు
సూర్యాస్తమయం: సా. 6:07 కు

🕉️ మహాలయ అమావాస్య , పద్మకయోగం🕉️

గురుబోధ:
🕉️పితృదేవతలను ఏమని కోరుకోవాలి? మా వంశం వృద్ధి చెందుగాక. మా వంశంలో దాతలు, వేదం చదువుకున్నవారు పెరుగు గాక, నీచులు పుట్టకుండా ఉండుగాక, మేము శ్రద్ధతో మంచి కార్యక్రమములు చేయుదుము గాక అని కోరుకోవాలి.
🕉️మహాలయ అమావాస్య పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైన దినము. ఈ రోజు అర్హత కలిగిన వారు చనిపోయిన తమ పెద్దలకు, ఇష్టమైన వారికి, స్నేహితులకు కూడా తర్పణములు ఇవ్వవచ్చు. స్వయంపాకం దానం ఇవ్వాలి. యమకృత శివకేశవ అష్టోత్తరము, పితృస్తవం వంటి స్తోత్రాలని అందరూ పారాయణము చేయాలి.

పితృదేవతా స్తోత్రం👇
https://www.youtube.com/embed/UgnxFM4YHYY
అమావాస్య వైశిష్ట్యం👇
https://youtu.be/OBwT8oxE1z4?si=W0UFR67DDvVqrnMf

expand_less