కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 20 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం
తిథి: చతుర్దశి రా.1.32 కు తదుపరి భాద్రపద అమావాస్య 21 రా.2.02 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: మఖ ఉ.9.06 కు తదుపరి పుబ్బ 21 ఉ.9.54 కు
యోగం: సాధ్య రా.8:06 కు తదుపరి శుభ 21 రా.7:52 కు
కరణం: విష్టి ఉ.11.53 కు తదుపరి శకుని రా.12.17 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.7:44-8:32 కు
వర్జ్యం: సా.5.22-7.01 కు
అమృతకాలం: రా.2.45-4.26 కు
సూర్యోదయం: ఉ. 5:50 కు
సూర్యాస్తమయం: సా. 6:07 కు
🕉️ ఘాత చతుర్దశి, మాస శివరాత్రి, మహాలయపక్షాలు (పితృపక్షములు), 14వ దినము 🕉️
గురుబోధ:
◆ దుర్మరణం, ఆత్మహత్య, అకాలమరణం, ప్రమాదవశాత్తూ మరణం, పొందిన వారికి వారి పేరు మీదుగా ఈరోజు తర్పణాలు విడవడం ద్వారా ఉత్తమగతులు కలుగుతాయి. అందుకే ఈ తిథిని ఘాత చతుర్దశి అంటారు.
◆ పితృదేవతలకు జరిపే క్రతువులలో దోషాలు ఉన్నా, ఎవరైనా బంధుమిత్రులలోని వారు అకాలమరణం పొందినా, పితరులకు ఉత్తమగతులు అందించాలన్నా ఒకే ఒక ఉత్తమ మార్గం భాగవత సప్తాహం జరిపించుట.
◆ పిండములను బాగా చేపలు ఎక్కువ ఉన్ననీటిలో విడవవచ్చు. కుదరని పక్షంలో భూమిలో పాతిపెట్టవచ్చు లేదా గోవుకు తినిపించవచ్చు. ఎంత గొప్పగా శ్రాద్ధం నిర్వహించినా గోవులకు గ్రాసం అందిచకపోతే సంపూర్ణం కాదని శాస్త్రం.
పితృదేవతా స్తోత్రం👇
https://youtu.be/UgnxFM4YHYY?si=uUfkETkRGcPPOrTw
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial