కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 20 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం
తిథి: విదియ తె. 4.10 కు తదుపరి తదియ రా. 1.40 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: రేవతి ఉ. 9.38 కు తదుపరి అశ్విని
యోగం: ధ్రువ మ. 03.19 కు తదుపరి వ్యాఘాత
కరణం: వణిజ ఉ. 10.55 కు తదుపరి విష్టి
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.31 - 09.19 కు & మ. 12.34 - 01.22 కు
వర్జ్యం: తె. 4.17 - 5.46 కు
అమృతకాలం: రా. 1.19 - 2.48 కు
సూర్యోదయం: ఉ. 6.05 కు
సూర్యాస్తమయం: సా. 6.14 కు
గురుబోధ:
మహాలయ పక్షంలో హరిహరుల స్మరణ చాలా మంచిది. 'రుచి' అనే ప్రజాపతి పితృదేవతలని స్తుతించాడు. రుచి ప్రజాపతి చేసిన పితృస్తవము ఈ 15 రోజులు భక్తితో పారాయణ చేయాలి. అమావాస్య నాడు ఈ స్తోత్రం చేసినటువంటి వాళ్ళకి పితృదేవతల యొక్క కటాక్షం లభిస్తుంది.