"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐సెప్టెంబరు 20 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం శుక్లపక్షము తిథి : పంచమి ఉ. 10గం౹౹42ని౹౹ వరకు తదుపరి షష్ఠి వారం : సౌమ్యవారం (బుధవారం) నక్షత్రం : విశాఖ మ. 12గం౹౹47ని౹౹ వరకు తదుపరి అనూరాధ యోగం : విష్కంభ 21వ తేదీ తె. 03గం౹౹06ని౹౹ వరకు తదుపరి ప్రీతి కరణం : బాలవ మ. 02గం౹౹16ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹31ని౹౹ నుండి 12గం౹౹20ని౹౹ వరకు వర్జ్యం : సా. 04గం౹౹47ని౹౹ నుండి 06గం౹౹23ని౹౹ వరకు అమృతకాలం : రా. 02గం౹౹25ని౹౹ నుండి 04గం౹౹01ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹52ని౹౹కు సూర్యాస్తమయం : సా. 05గం౹౹57ని౹౹కు
భాద్రపద శుద్ధ పంచమి, ఋషిపంచమి
గురుబోధ మానవులై పుట్టాక ఋషుల ఋణం, దేవతల ఋణం, పితృదేవతల ఋణం ఈ ఋణాలన్నీ తీర్చుకోవాలి. అందులో ఋషుల యొక్క ఋణం తప్పక తీర్చుకోవాలి. ఈ రోజున మనం వీలున్నంతవరకు ఋషులు యొక్క పేర్లు తలుచుకోవాలి. పంచమినాడు ప్రొద్దుటే లేచి తలారా స్నానం చేసి కాసేపు విఘ్నేశ్వర ధ్యానం చేశాక సప్తఋషులను కౌండిన్యుడు, అత్రి, మరీచి మొదలైనటువంటి ఋషులను ముఖ్యంగా వ్యాసుడిని తప్పక తలచుకోవాలి. ఋషుల పేర్లు చెప్పి ఈ ఋషులు రాసినటువంటి పుస్తకాలు లోకంలో ప్రచారం చేస్తున్న మహానుభావులైనటువంటి గురువులందరినీ తలచుకోవాలి. గురుపూజ చేయటం మంచిది. ఋషులవలె జీవితం సాగిస్తున్నటువంటి పౌరాణికులను ఈ రోజు పూజిస్తే సకల దేవతలు అనుగ్రహిస్తారు. ఋషిఋణం తీరుతుంది. ఋషి పంచమి నాడు సాయంత్రం వేళ శివాలయములో ప్రదక్షిణ చేసి శివుడ్ని దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అందునా ప్రదోష కాలంలో శివదర్శనం చాలా మంచిది.
గణపతి నామాల్లో హేరంబుడు అంటే తీవ్రమైన కష్టాలని తొలగించేవాడని అర్థం. ప్రతి బుధవారం భక్తి శ్రద్ధలతో “ఓం హం హేరంబాయ నమః” అని 1000 సార్లు జపిస్తే కష్టాలు, దైన్యం తొలగిపోతాయి. గణపతి నవరాత్రుల సందర్భంగా శ్రీ సంపూర్ణ గణేశ పురాణం
![]()