" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 సెప్టెంబర్ 20 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షము తిథి : దశమి రాత్రి 08గం౹౹21ని౹౹ వరకు తదుపరి ఏకాదశి వారం : భౌమవారం (మంగళవారం) నక్షత్రం : పునర్వసు ఈ రోజు రాత్రి 09గం౹౹20ని౹౹ తదుపరి పుష్యమి యోగం : వరీయాన్ ఈ రోజు ఉదయం 08గం౹౹25ని౹౹ వరకు తదుపరి పరిఘ కరణం : వణిజ ఈ రోజు ఉదయం 08గం౹౹15ని౹౹ వరకు తదుపరి విష్టి రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉదయం 08గం౹౹18ని౹౹ నుండి 09గం౹౹06ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹42ని౹౹ నుండి 11గం౹౹30ని౹౹ వరకు వర్జ్యం : ఉదయం 08గం౹౹01ని౹౹ నుండి 09గం౹౹47ని౹౹ వరకు అమృతకాలం : సాయంత్రం 06గం౹౹40ని౹౹ నుండి 08గం౹౹26ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹52ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹56ని౹౹ గురుబోధ దేవతాపూజలు, పితృకార్యాలు వంటివి చేసేటప్పుడు ఎంతో శ్రద్ధాభక్తులతో చేయాలి. వాటితో పాటు సరైన విద్య (ధర్మశాస్త్ర అవగాహన) తెలిసి ఉండాలి. అప్పుడే సంపూర్ణ ఫలితం ఇస్తుంది అందుకే పురాణములు, ధర్మశాస్త్రములు పెద్దల ద్వారా తెలుసుకోవాలి. ఉదా౹౹ భీష్ముడు తన తండ్రి శంతనుడికి శ్రాద్ధ కార్యక్రమం చేస్తున్నప్పుడు పిండమును స్వయంగా శంతనుడే చెయ్యి చాపి తన చేతిలో పెట్టు, నేను స్వయంగా స్వీకరిస్తాను అంటాడు. కానీ ధర్మశాస్త్ర ప్రకారం పిండము చనిపోయిన తల్లితండ్రులకు కాదు, పితృదేవతలకు. అందుకే వాటిని దర్భల పైనే ఉంచి, శంతనుడి మాటను తిరస్కరిస్తాడు. తన ధర్మనిరతి కి సంతోషించిన పితృదేవతలు ప్రత్యక్షమై భీష్ముడిని ఆశీర్వదిస్తారు. అదే శంతనుడికి పిండము ఇచ్చి ఉంటే పితృదేవతల ఆగ్రహానికి గురి అయ్యేవాడు.