"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 18 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం శుక్లపక్షము
తిథి : తదియ ఉ. 10గం౹౹14ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : ఇందువారం (సోమవారం)
నక్షత్రం : చిత్త ఉ. 11గం౹౹15ని౹౹ వరకు తదుపరి స్వాతి
యోగం : ఐంద్ర 19వ తేదీ తె. 04గం౹౹24ని౹౹ వరకు తదుపరి వైధృతి
కరణం : గరజి మ. 12గం౹౹39ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹20ని౹౹ నుండి 01గం౹౹09ని౹౹ వరకు & మ. 02గం౹౹46ని౹౹ నుండి 03గం౹౹35ని౹౹ వరకు
వర్జ్యం : సా. 04గం౹౹56ని౹౹ నుండి 06గం౹౹36ని౹౹ వరకు
అమృతకాలం : రా. 02గం౹౹58ని౹౹ నుండి 04గం౹౹38ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹52ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹00ని౹౹కు
🕉️ వినాయక చతుర్థి, శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి వారి జయంతి, స్వర్ణ గౌరీ వ్రతం, తామస మన్వాది - భాద్రపద శుక్ల చతుర్థి, గణపతి నవరాత్రులు ప్రారంభం 🕉️
శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం👇గురుబోధ
గణేశచతుర్థి నాడు చేయవలసిన కొన్ని ముఖ్యమైనవి:
1) ఈ తిథి నాడు ఉదయమే లేచి తలారా స్నానము చేసి సంధ్యావందనాది కార్యక్రమాలు చేసి ఆ తరువాత మట్టితోటి విఘ్నేశ్వరుడి యొక్క ప్రతిమను చేయండి. మట్టి ప్రతిమను పూజించాలి అని పదేపదే మన పురాణాలు చెపుతున్నాయి.
2) అందులోకి విఘ్నేశ్వరుడిని ఆవాహన చేయాలి. పెద్ద పెద్ద విగ్రహాలు ఎన్ని. పెట్టినా తప్పనిసరిగా చిన్న ప్రతిమ ఉండాలి. నిమజ్జనం చేసేటప్పుడు ఎన్ని రకాల ప్రతిమలు ఉన్నప్పటికీ మట్టి బొమ్మ లేకపోతే ఆ నిమజ్జనం వ్యర్థమైపోతుంది.
3) విఘ్నేశ్వరుడు మోదకప్రియుడు.మోదకము అంటే లడ్డు. ఉత్తర్ భారత్ వాళ్ళు తీపి లడ్డూలు తయారు చేస్తారు. మోదకము అంటే ఆవిరితో తయారు అయినటువంటి బియ్యపురవ్వతో తయారు చేసినవి కుడుములను కూడా మోదకములు అంటారు. మన తెలుగు వాళ్ళు కుడుములు పెడతారు. రెండూ శాస్త్రమే. కుడుములు నివేదన చేసి ప్రసాదంగా తినాలి.
3) కథా అక్షతలు వేసుకోవాలి. కథ వింటున్నప్పుడు చేతిలో అక్షతలు ఉంచుకోవాలి. కథ అయ్యాక విగ్రహం దగ్గర వేసి అక్షతలు నెత్తి మీద వేసుకోవాలి. అలా అక్షతలు వేసుకోకుండా చంద్రుడిని చూస్తే నీలాపనిందలు వస్తాయి.
5) విఘ్నేశ్వరుడి పూజలో ప్రత్యేకత ఏమిటంటే మనకి మనమే మొట్టికాయలు వేసుకుంటే మహాపాపాలు అన్నీ తొలగిపోతాయి. ఆయనకి ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసిన మహాఫలితం వస్తుంది.
6) ఒక పుస్తకం కానీ, పలక కానీ దాని మీద 'ఓం' కారం రాసి విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టి పుస్తకాలు వాడుకుంటే చదువు బాగా పెరుగుతుంది. విఘ్నేశ్వరుడి గురించి "భక్తి ప్రియో గణేశః" అని శివపురాణం చెపుతున్నది. భక్తి అంటే ఆయనకి చాలా ఇష్టం. అత్యంత భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వరుడిని పూజించి కథా అక్షతలు శిరస్సున వేసుకుంటే ఆ సంవత్సరమంతా విఘ్నాలు నుంచి బయటపడతాము.