Sep 18 2022సెప్టెంబర్ 18 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబర్ 18 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం వర్ష ఋతువు  
భాద్రపదమాసం కృష్ణపక్షము 

తిథి : అష్టమి   సాయంత్రం 04గం౹౹21ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం : మృగశిర ఈ రోజు సాయంత్రం 04గం౹౹15ని౹౹ తదుపరి ఆరుద్ర
యోగం :  సిద్ధి ఈ రోజు ఉదయం 06గం౹౹24ని౹౹ వరకు తదుపరి వ్యతీపాత 
కరణం : కౌలవ ఈ రోజు సాయంత్రం 04గం౹౹32ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి  06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సాయంత్రం 04గం౹౹32ని౹౹ నుండి 05గం౹౹12ని౹౹ వరకు 
వర్జ్యం : రాత్రి 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹15ని౹౹ వరకు 
అమృతకాలం :  ఉదయం 06గం౹౹37ని౹౹ నుండి 08గం౹౹22ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹52ని౹౹ 
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹59ని౹౹


◆ వ్యతీపాత మహాలయం,  ఆరుద్రాష్టమి, మధ్వాష్టమి, సూర్య సావర్ణిక మన్వాది
.
గురుబోధ
 _పితృకార్యాలు - పాటించవలసిన కొన్ని ముఖ్య విధులు_ 
★ఇంటిముందు ముగ్గు వేయరాదు. తోరణాలు ఉండకూడదు.     
★పితృకార్యక్రమాలు  ఉన్నరోజు సంధ్యావందనం &  నిత్య పూజ తప్పక ఉదయం లఘువుగా ముగించాలి. 
★  పూజ చేయడం కుదరని పక్షంలో ఇంటిలో వెరేవారిచేత పూజ చేయించాలి. నైవెద్యంగా పళ్ళు లేదా బెల్లం వంటివి పెట్టవచ్చు. మహా నైవేద్యం కర్త పెట్టరాదు. ఆ పూట  దేవతా పూజలో శంఖం పూరించరాదు.  
★ భోక్తలు ఇంటికి రాగానే వారికి ఆసనంలో  కూర్చోబెట్టి పాదములు కడగాలి. 
★కర్త సంధ్యావందనం అయ్యాక కఠ ఉపనిషత్ పారాయణము చేయడం, భగవద్గీత పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణము  చేయడం మంచిది.
★ నాస్తికులకు దూరంగా ఉండాలి.
★ కర్త శ్రాద్ధం పూర్తి అయ్యేంతవరకు దానం చేయడం, వేద పఠనం చేయరాదు. చీపురు పట్టుకోవడం చేయరాదు.  ★పితృదేవతలు ఏ రూపంలో అయినా రావచ్చు.  ఒకవేళ కర్త ఎవరికైనా దానం చేయడం, భిక్ష పెట్టడం చేస్తే పితృదేవతలు సంతృప్తి చెంది వెళ్లిపోవచ్చు. అందుకే కర్త, శ్రాద్ధం అయ్యేంత వరకు ఎటువంటి దానం చేయకూడదు. చేయాల్సివస్తే ఇతరుల చేత చేయించవచ్చు.
★ఉదయం  నిత్య దేవతా పూజ  సంక్షిప్తముగా  ఆచరించాలి. కుదరని పక్షంలో సాయంత్రం  చేయాలి. పితృకార్యాలు ఉన్నప్పుడు దేవతాపూజ చిన్నగా చేసి ముగించాలి. దేవతా పూజ చేయకుండా ఉండరాదని శాస్త్రం.  

expand_less