" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 సెప్టెంబర్ 18 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షము తిథి : అష్టమి సాయంత్రం 04గం౹౹21ని౹౹ వరకు తదుపరి నవమి వారం : భానువారం (ఆదివారం) నక్షత్రం : మృగశిర ఈ రోజు సాయంత్రం 04గం౹౹15ని౹౹ తదుపరి ఆరుద్ర యోగం : సిద్ధి ఈ రోజు ఉదయం 06గం౹౹24ని౹౹ వరకు తదుపరి వ్యతీపాత కరణం : కౌలవ ఈ రోజు సాయంత్రం 04గం౹౹32ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : సాయంత్రం 04గం౹౹32ని౹౹ నుండి 05గం౹౹12ని౹౹ వరకు వర్జ్యం : రాత్రి 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹15ని౹౹ వరకు అమృతకాలం : ఉదయం 06గం౹౹37ని౹౹ నుండి 08గం౹౹22ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹52ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹59ని౹౹ ◆ వ్యతీపాత మహాలయం, ఆరుద్రాష్టమి, మధ్వాష్టమి, సూర్య సావర్ణిక మన్వాది . గురుబోధ _పితృకార్యాలు - పాటించవలసిన కొన్ని ముఖ్య విధులు_ ★ఇంటిముందు ముగ్గు వేయరాదు. తోరణాలు ఉండకూడదు. ★పితృకార్యక్రమాలు ఉన్నరోజు సంధ్యావందనం & నిత్య పూజ తప్పక ఉదయం లఘువుగా ముగించాలి. ★ పూజ చేయడం కుదరని పక్షంలో ఇంటిలో వెరేవారిచేత పూజ చేయించాలి. నైవెద్యంగా పళ్ళు లేదా బెల్లం వంటివి పెట్టవచ్చు. మహా నైవేద్యం కర్త పెట్టరాదు. ఆ పూట దేవతా పూజలో శంఖం పూరించరాదు. ★ భోక్తలు ఇంటికి రాగానే వారికి ఆసనంలో కూర్చోబెట్టి పాదములు కడగాలి. ★కర్త సంధ్యావందనం అయ్యాక కఠ ఉపనిషత్ పారాయణము చేయడం, భగవద్గీత పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణము చేయడం మంచిది. ★ నాస్తికులకు దూరంగా ఉండాలి. ★ కర్త శ్రాద్ధం పూర్తి అయ్యేంతవరకు దానం చేయడం, వేద పఠనం చేయరాదు. చీపురు పట్టుకోవడం చేయరాదు. ★పితృదేవతలు ఏ రూపంలో అయినా రావచ్చు. ఒకవేళ కర్త ఎవరికైనా దానం చేయడం, భిక్ష పెట్టడం చేస్తే పితృదేవతలు సంతృప్తి చెంది వెళ్లిపోవచ్చు. అందుకే కర్త, శ్రాద్ధం అయ్యేంత వరకు ఎటువంటి దానం చేయకూడదు. చేయాల్సివస్తే ఇతరుల చేత చేయించవచ్చు. ★ఉదయం నిత్య దేవతా పూజ సంక్షిప్తముగా ఆచరించాలి. కుదరని పక్షంలో సాయంత్రం చేయాలి. పితృకార్యాలు ఉన్నప్పుడు దేవతాపూజ చిన్నగా చేసి ముగించాలి. దేవతా పూజ చేయకుండా ఉండరాదని శాస్త్రం.