కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 17 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం
తిథి: షష్ఠి ఉ.10.10 కు తదుపరి సప్తమి 18 ప.11.58 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: అనూరాధ రా.8.28 కు తదుపరి జ్యేష్ఠ 18 రా.10.55 కు
యోగం: విష్కంభ మ.12:49 కు తదుపరి ప్రీతి 18 మ.1:34 కు
కరణం: తైతుల ఉ.10:48 కు, గరజి రా.11:52 కు తదుపరి వణిజ 18 మ.1:01 కు
రాహుకాలం: మ. 01.30 – 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.09 – 10.58 కు, మ. 2.59 – 3.48 కు
వర్జ్యం: రా.2.38 – 4.24 కు
అమృతకాలం: ఉ. 08.23 – 10.09 కు
సూర్యోదయం: ఉ. 6.08 కు
సూర్యాస్తమయం: సా. 6.13 కు
🕉️ కన్యాసంక్రమణ, విశ్వకర్మ జయంతి 🕉️
గురుబోధ:
🕉️పూర్వం శ్రీమహావిష్ణువు ఇచ్చిన వరం వలన, నేల మీద కూర్చొని జపం చేస్తే ఆ ఫలితం భూదేవికి వెళ్ళిపోతుంది. కాబట్టి దర్భ చాప మీద కానీ, పీట మీద కానీ, కనీసం దర్భ ఒకటైనా వేసుకుని కూర్చోవాలి. కేవలం నేలమీద కూర్చొని జపం లేదా పూజ చేయరాదు.
🕉️శ్రీ మహావిష్ణు వేదస్తుతి (గాలవ ముని కృతం) – ఇందులో చతుర్వేదములు, ఉపనిషత్తుల యొక్క సారం నిక్షిప్తమై ఉన్నది. అందుకే ఇది వేదస్తుతి. ఇది విన్నా కూడా మనమే స్వయంగా స్తుతించిన, రచించిన ఫలితం పొందుతాము. వీలున్నప్పుడల్లా ఇది విన్నా, ముఖ్యంగా అమావాస్యలలో, సంక్రమణ పర్వదినాలలో, గ్రహణాలలో, నదీస్నానాలలో ఈ స్తోత్రం వింటే తిరుగులేనటువంటి శక్తి పొందుతాము. శ్రీ మహావిష్ణువు ఈ స్తోత్రం విన్నవారిని రక్షించే బాధ్యత తనదేనని, రక్షణకై తన సుదర్శన చక్రమే పంపుతానని అన్నాడు. ఇది హరిరక్షణ పొందించే అద్భుత స్తోత్రం. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనం పొందే కష్టాల నుండి బయటపడవేసే అపూర్వ స్తోత్రం.👇