కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 17 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం
తిథి: చతుర్దశి ఉ. 11.09 కు తదుపరి పూర్ణిమ
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: శతభిషం మ. 2.30 కు తదుపరి పూర్వాభాద్ర
యోగం: ధృతి ఉ. 07.48 కు తదుపరి శూల
కరణం: వణిజ ఉ. 11.44 కు తదుపరి విష్టి
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.31 - 09.20 కు & రా. 11.00 - 11.47 కు
వర్జ్యం: రా. 8.29 - 9.59 కు
అమృతకాలం: తె. 5.31 - 07.00 కు & ఉ. 7.43 - 9.13 కు
సూర్యోదయం: ఉ. 6.04 కు
సూర్యాస్తమయం: సా. 6.16 కు
🕉️ శ్రీ విశ్వకర్మ జయంతి 🕉️
శ్రీ మహావిష్ణు వేదస్తుతి (గాలవ ముని కృతం)👇
https://youtu.be/UwFKCtE_fRU?si=6z-Z-cC7Gx1NgZhf
గురుబోధ:
భాద్రపద పూర్ణిమ నాడు భాగవత గ్రంథమును తప్పక పూజించాలి. పరీక్షిత్ మాహారాజుకు శుకుడు భాద్రపద పూర్ణిమ నాడు భాగవత సప్తాహమును పూర్తిచేసాడు. అందుకే ఆ రోజు భాగవతముకు పట్టాభిషేకం చేస్తారు.
శుకమహర్షి నిర్వహించిన తరువాత మనకు తెలిసి దేశచరిత్రలో చాలా కాలం తరువాత అభినశుకులు పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే పరమపవిత్ర ద్వారకాక్షేత్రంలో 2024 భాద్రపదపూర్ణిమ నాడు నిర్వహించబడుతున్న మహాకార్యక్రమం- స్వర్ణసింహాసనం పై భాగవతగ్రంథ పూజా మహోత్సవం