Sep 17 2023సెప్టెంబరు 17 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబరు 17 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం శుక్లపక్షము

తిథి : విదియ ఉ. 09గం౹౹05ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం : హస్త ఉ. 09గం౹౹22ని౹౹ వరకు తదుపరి చిత్త
యోగం : బ్రహ్మ 18వ తేదీ తె. 04గం౹౹28ని౹౹ వరకు తదుపరి ఐంద్ర
కరణం :  కౌలవ ఉ. 11గం౹౹08ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹24ని౹౹ నుండి 05గం౹౹13ని౹౹ వరకు 
వర్జ్యం : సా. 05గం౹౹56ని౹౹ నుండి 07గం౹౹39ని౹౹ వరకు
అమృతకాలం : తె. 04గం౹౹13ని౹౹ నుండి 05గం౹౹13ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹51ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹00ని౹౹కు

🕉️ శ్రీ విశ్వకర్మ  జయంతి వరాహ స్వామి జయంతి కన్యా సంక్రమణ 🕉️

వినాయక చతుర్థి - భాద్రపద శుక్ల చతుర్థి - సెప్టెంబర్ 18 (సోమవారం)

శ్రీ గణేశ భుజంగ స్తోత్రం👇 


ఈ స్తోత్రం భార్యాభర్తల మధ్యలో కీచులాటలు ఎక్కువైపోతున్నప్పుడు తొమ్మిది (9) చతుర్థీ (చవితి) తిథులలో అనగా వరుసగా చవితి వచ్చినప్పుడల్లా, పారాయణం చేసినా, విన్నా భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం వస్తుంది. ప్రతి శుక్లపక్ష చతుర్థినాడు ఈ స్తోత్రాన్ని విన్నవారికి సంపదలు లభిస్తాయి. ఉద్యోగం కావాలనుకున్నవారు 40 రోజుల పాటు ఈ స్తోత్రాన్ని వినండి. గణేశాలయంలో ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఈ స్తోత్రం వింటే, భూప్రదక్షిణ చేసిన ఫలితం. భయంకరమైన జాతకదోషాలు తొలగించి, విదేశీయానం కావాలనుకొన్నవారికి లభించేలా చేస్తుంది.  

గురుబోధ
"భాద్రపద శుక్ల తృతీయ" ఇది వరాహ జయంతి, ఈరోజు వరాహస్వామి వారిని తలుచుకోవాలి. ఆయన్ని తెల్లని పూలతో పూజ చేసినా, భూదానం చేసినా, వెండి దానం చేసినా సకల శుభాలు కలుగుతాయి.

expand_less