Sep 16 2025సెప్టెంబరు 16 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 16 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం

తిథి: నవమి ఉ.6.19 తదుపరి తదుపరి దశమి 17 తె.4.30 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: ఆరుద్ర ఉ.10.33 కు తదుపరి పునర్వసు 17 ఉ.9.43 కు
యోగం: వరీయాన్ రా.12:33 కు తదుపరి పరిఘ 17 సా.10:54 కు
కరణం: వణిజ మ.12.53 కు తదుపరి విష్టి రా.12.22 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.8:33-9:21 కు, మ. 10:59-11:47 కు
వర్జ్యం: రా.10.08-11.38 కు
అమృతకాలం: తె.4.04-5.38 కు
సూర్యోదయం: ఉ. 5:50 కు
సూర్యాస్తమయం: సా. 6:07 కు

🕉️ మహాలయపక్షాలు (పితృపక్షములు), 9వ దినము 🕉️

గురుబోధ:
ఈ మహాలయ పక్షకాలంలో పితృదేవతలకు శ్రాద్ధము, పిండప్రదానము ఒక పురోహితుడిని పెట్టుకుని జరిపిస్తే అందునా మహాలయపక్షంలో చిట్టచివరన అమావాస్య నాడు శ్రాద్ధం జరిపిస్తే ఈ పితృదేవతల యొక్క దోషాలు మనకి తొలగిపోతాయి. ప్రేతాత్మలకి విముక్తి కలుగుతుంది. వాళ్ళు ఊర్ధ్వలోకాలకి వెళతారు. దీనివల్ల మన సంసారములో ఉన్న కష్టాలు, నష్టాలు అన్నీ తొలగిపోతాయి. తెలిసి కానీ తెలియక కానీ మనకి ఇలాంటి కష్టాలు వస్తున్నాయంటే అవన్నీ ప్రేతాత్మల వల్ల వస్తున్నాయి. ఈ మహాలయం వల్ల అవి తొలగిపోతాయి.

పితృదేవతా స్తోత్రం👇
https://youtu.be/UgnxFM4YHYY?si=uUfkETkRGcPPOrTw

expand_less