కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 16 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం
తిథి: త్రయోదశి మ. 1.13 కు తదుపరి చతుర్దశి
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: ధనిష్ఠ మ. 3.51 కు తదుపరి శతభిషం
యోగం: సుకర్మ ఉ. 11.42 కు తదుపరి ధృతి
కరణం: తైతుల మ. 03.10 కు తదుపరి గరజి
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.35 - 01.24 కు & మ. 03.02 - 03.51 కు
వర్జ్యం: రా. 10.38 - 12.09 కు
అమృతకాలం: ఉ. 5.58 - 7.09 కు
సూర్యోదయం: ఉ. 6.04 కు
సూర్యాస్తమయం: సా. 6.17 కు
🕉️ కన్యా సంక్రమణం రా. 7.35 🕉️
గురుబోధ:
నిత్యం ఈ శ్లోకం పఠనం చేయడం వలన సకల భయాలు నుండి జగన్మాత రక్షిస్తుంది.
సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే |
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోఽస్తు తే || 5 ||
ఓ దుర్గాదేవీ! సమస్త స్వరూపములు నీవైన తల్లీ! అందఱికి పాలకురాలైన మాతా! అనేక దేవతాశక్తులతో కూడియున్న మాతా! ఓ ప్రకాశస్వరూపిణీ! మమ్ములను అన్నివిధముల భయముల నుండి రక్షింపుము.