Sep 16 2023సెప్టెంబరు 16 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబరు 16 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం శుక్లపక్షము

తిథి : పాడ్యమి ఉ. 07గం౹౹51ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం : ఉత్తర ఉ. 07గం౹౹32ని౹౹ వరకు తదుపరి హస్త
యోగం : శుక్ల 17వ తేదీ తె. 04గం౹౹13ని౹౹ వరకు తదుపరి బ్రహ్మ
కరణం :  బవ ఉ. 09గం౹౹17ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 05గం౹౹51ని౹౹ నుండి 07గం౹౹28ని౹౹ వరకు 
వర్జ్యం : సా. 04గం౹౹34ని౹౹ నుండి 06గం౹౹17ని౹౹ వరకు
అమృతకాలం : రా. 02గం౹౹54ని౹౹ నుండి 04గం౹౹37ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹51ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹00ని౹౹కు

వినాయక చతుర్థి - భాద్రపద శుక్ల చతుర్థి - సెప్టెంబర్ 18 (సోమవారం) 

శ్రీ ఆదిశంకరాచార్య విరచితమైన శ్రీ గణేశ పంచరత్నమాలా స్తోత్రం👇 

ఈ స్తోత్రం సామాన్యమైనది కాదు. విఘ్నాలను, ఆటంకాలను, భయంకరమైన రోగాలను తొలగించి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని ప్రసాదిస్తుంది. పారాయణం చేసినా లేక విన్నా కూడా అద్భుత ఫలితాలు లభిస్తాయి. అనుకున్న పనులు అయ్యి తీరుతాయి. ముఖ్యంగా చతుర్థి , సంకటహరచతుర్థి అందునా భాద్రపదమాసంలో గణేశచతుర్థి వచ్చినప్పుడు ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఎంతో మంచిది.

గురుబోధ*
శాస్త్రప్రకారం వినాయకుని పూజకు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎటువంటి సందర్భంలోనూ తులసీదళాలు ఉపయోగించరాదు. "శ్రీ శివపురాణం" లో తులసీదళానికి బదులుగా "శిరీషదళము" అని ఉన్నది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు.

expand_less