Sep 16 2022సెప్టెంబర్ 16 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబర్ 16 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం వర్ష ఋతువు  
భాద్రపదమాసం కృష్ణపక్షము 

తిథి : షష్ఠి  మధ్యాహ్నం 01గం౹౹26ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం : కృత్తిక ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹11ని౹౹ తదుపరి రోహిణి
యోగం :  వజ్ర ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం : వణిజ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹19ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి  12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 08గం౹౹17ని౹౹ నుండి 09గం౹౹06ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹21ని౹౹ నుండి 01గం౹౹10ని౹౹ వరకు
వర్జ్యం : తెల్లవారి 03గం౹౹29ని౹౹ నుండి 05గం౹౹24ని౹౹ వరకు 
అమృతకాలం :  ఉదయం 09గం౹౹38ని౹౹ నుండి 11గం౹౹49ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹51ని౹౹ 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹01ని౹౹

గురుబోధ

మనం ఎంత భక్తులమైనా,  ఉపాసకులమైనా పితృకార్యములు చేయనివారికి కష్టాలు తప్పవు. సాక్షాత్తు రాముడు, కృష్ణుడు కూడా పితృకార్యక్రమాలు చేసారు. మనం చేయకపోతే ఎలా?  

శ్రాద్ధం నాడు తప్పక తర్పణాలు విడవాలి. వాటికి మినహాయింపు లేదు. శ్రాద్ధములో కొన్ని విధానాలు.  
1. క్షణ శ్రాద్ధం - యోగ్యులైన భోక్తలను విశ్వే, పితృస్థానాలలో ఆహ్వానించి శాస్త్రోక్తంగా శ్రాద్ధం జరిపించడం.   
2. కూర్చ శ్రాద్ధం - యోగ్యులు దొరకకపోతే, దర్భలలో విశ్వే, పితృదేవతలను ఆహ్వానం చేసి శాస్త్రోక్తంగా శ్రాద్ధం జరిపించడం. 
3. ఆమ శ్రాద్ధం - పై రెండు కుదరనప్పుడు స్వయంపాకం, దక్షిణతో దానం ఇవ్వడం.  
4. హేమ శ్రాద్ధం - పై 3 కుదరనప్పుడు, శ్రాద్ధముకు తగిన బంగారం, వెండి లేదా ధనమును దానం చేయడం.
5. సంకల్ప తర్పణము - పై 4 కుదరనప్పుడు సంకల్పం చెప్పుకొని అర్ఘ్యం, తర్పణం మొ|| ఇవ్వడం. 
6. గోగ్రాస  ప్రదానము - పై 5 కుదరనప్పుడు గోవుకు యథాశక్తి గ్రాసం సమర్పించి, గోవుకు, పితృదేవతలకు నమస్కరించడం.  
7. పితృ ప్రార్థన - రెండు చేతులెత్తి ఆకాశం వైపు చూస్తూ పితృదేవతలారా! నేను పైన చెప్పిన ఏ విధమైన శ్రాద్ధం పెట్టలేను. నా దగ్గర ధనం లేదు. కనీసం గోవుకు గ్రాసం కూడా ఇచ్చే స్థితిలో లేను. దయచేసి నన్ను మన్నించండని ప్రార్థించాలి.

expand_less