Sep 15 2026సెప్టెంబరు 15 2026favorite_border

కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 15 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం

తిథి: చతుర్థి ఉ.7.41 కు తదుపరి పంచమి 16 ఉ.8.43 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: స్వాతి సా.4.33 కు తదుపరి విశాఖ 16 సా.6.19 కు
యోగం: ఐంద్ర మ.12:19 కు తదుపరి వైధృతి 16 మ.12:22 కు
కరణం: విష్టి ఉ.7:44 కు, బవ రా.8:17 కు తదుపరి బాలవ 16 ఉ.8:59 కు
రాహుకాలం: మ. 03.00 – 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.33 – 9.21 కు, రా. 11.00 – 11.47 కు
వర్జ్యం: రా.10.33 – 12.16 కు
అమృతకాలం: ఉ. 06.00 – 07.41 కు
సూర్యోదయం: ఉ. 6.07 కు
సూర్యాస్తమయం: సా. 6.15 కు

🕉️ భౌమ చతుర్థి, భాద్రపద శుద్ధ పంచమి, ఋషిపంచమి 🕉️

గురుబోధ:
🪷మానవులై‌ పుట్టాక ఋషుల ఋణం, దేవతల ఋణం, పితృదేవతల ఋణం ఈ ఋణాలన్నీ తీర్చుకోవాలి. అందులో ఋషుల యొక్క ఋణం తప్పక తీర్చుకోవాలి. ఈ రోజున మనం వీలున్నంతవరకు ఋషులు యొక్క పేర్లు తలుచుకోవాలి. పంచమినాడు ప్రొద్దుటే లేచి తలారా స్నానం చేసి కాసేపు విఘ్నేశ్వర ధ్యానం చేసాక సప్తఋషులను కౌండిన్యుడు, అత్రి, మరీచి మొదలైనటువంటి ఋషులను ముఖ్యంగా వ్యాసుడిని తప్పక తలచుకోవాలి. ఋషుల పేర్లు చెప్పి ఈ ఋషులు రాసినటువంటి పుస్తకాలు లోకంలో ప్రచారం చేస్తున్న మహానుభావులైనటువంటి గురువులందరినీ తలచుకోవాలి. గురుపూజ‌ చేయటం మంచిది. ఋషులవలె జీవితం సాగిస్తున్నటువంటి పౌరాణికులను ఈ రోజు పూజిస్తే సకల దేవతలు అనుగ్రహిస్తారు. ఋషిఋణం తీరుతుంది. ఋషిపంచమి నాడు సాయంత్రం వేళ శివాలయములో ప్రదక్షిణ చేసి శివుడిని దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అందునా ప్రదోషకాలంలో శివదర్శనం చాలా మంచిది.
🪷చతుర్థీ తిథి మంగళవారం వస్తే ఆ పర్వదినమును అంగారకచతుర్థి లేదా భౌమచతుర్థి అంటారు. అమ్మవారిని ప్రతి మంగళవారం మంగళచండిక, మంగళగౌరి అనే పేర్లతో పిలుస్తూ పూజిస్తే చాలా మంచిది. తీవ్రమైన కష్టాలలో కూరుకుపోయి పనులు అవ్వక యాతన పడుతున్నవారు, ఈ పవిత్రస్తోత్రం చేస్తే ఆ తీవ్ర కష్టాలు తొలగి సర్వపతనం అయిపోయినవారు కూడా మళ్ళీ ఉద్ధరింపబడుతారు. స్వగృహప్రాప్తి వంటి అపూర్వఫలితాలు అందించే ఈ స్తోత్రాన్ని మనసు చెదరకుండా శ్రద్ధతో చదివినా, విన్నా సకల శుభములు కలుగుతాయి. అమంగళం జరుగదు. పుత్రసంతానం కలిగి తీరుతుంది.

ఋణవిమోచన అంగారక(కుజ) స్తోత్రము👇
https://youtu.be/Ij6aTtQF42Y?si=bUQjZV9ad0063bZ3
మంగళచండికా స్తోత్రము👇
https://youtu.be/NYUcTwrLhy0?si=uqCBBxK-BH7B9HoR

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less