Sep 15 2023సెప్టెంబరు 15 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబరు 15 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం శుక్లపక్షము

తిథి : అమావాస్య ఉ. 06గం౹౹04ని౹౹ వరకు తదుపరి పాడ్యమి
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం : ఉత్తర పూర్తిగా ఉంది
యోగం : శుభ 16వ తేదీ తె. 03గం౹౹42ని౹౹ వరకు తదుపరి శుక్ల
కరణం :  నాగ ఉ. 07గం౹౹09ని౹౹ వరకు తదుపరి కింస్తుఘ్న
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹17ని౹౹ నుండి 09గం౹౹06ని౹౹ వరకు & మ. 12గం౹౹21ని౹౹ నుండి 01గం౹౹10ని౹౹ వరకు 
వర్జ్యం : ఉ. 01గం౹౹00ని౹౹ నుండి 02గం౹౹46ని౹౹ వరకు
అమృతకాలం : రా. 11గం౹౹35ని౹౹ నుండి 01గం౹౹20ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹51ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹01ని౹౹కు

🕉️ భాద్రపదమాసం ప్రారంభం 🕉️



వినాయక చతుర్థి - భాద్రపద శుక్ల చతుర్థి - సెప్టెంబర్ 18 (సోమవారం) 

గురుబోధ*
విఘ్నేశ్వరునికి అనంత నామాలున్నాయి. అనేక అవతారాలున్నాయి. ఆయన లీలాగాథలు కూడా అనంతాలే. నిర్గుణుడు. సగుణుడు కూడా విఘ్నేశ్వరుడే. అటువంటి గణేశ్వరునికి మరింత ఇష్టమైన పదహారునామాలు ఉన్నాయని, ఆ పదహారునామాలని భక్తితో తలచుకుంటే సకల శుభాలు కలుగుతాయని వ్యాసమహర్షి సెలవిచ్చాడు. ఈ పదహారు నామాలను ఉచ్చరించినా, విన్నా కూడా శుభాలే కలుగుతాయి. అందునా విద్యారంభసమయంలోనూ, వివాహసమయంలోనూ, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు లేక గృహాదులలో ప్రవేశిస్తున్నప్పుడూ, యుద్ధసమయంలోనూ, ఇంకా సర్వకార్యాలలోనూ ఈ నామాలు ఉచ్చరించిన వానికి, విన్నవానికి విఘ్నాలు తొలగిపోతాయి. ఆ నామములను గురించి విడివిడిగా తెలుసుకుందాం. 1. సుముఖుడు 2. ఏకదంతుడు 3. కపిలుడు 4. గజకర్ణకుడు 5. లంబోదరుడు 6. వికటుడు 7. విఘ్నరాజు 8. గణాధిపుడు 9. ధూమకేతుడు 10. గణాధ్యక్షుడు 11. ఫాలచంద్రుడు 12. గజాననుడు. 13. వక్రతుండుడు 14.శూర్పకర్ణుడు 15. హేరంబుడు 16. స్కందపూర్వజుడు.

expand_less