కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 14 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం
తిథి: సప్తమి ఉ.10.36 కు తదుపరి అష్టమి 15 ఉ.8.21 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: రోహిణి మ.1.13 కు తదుపరి మృగశిర 15 ఉ.11.45 కు
యోగం: వజ్ర ఉ.7:35 కు తదుపరి వ్యతీపాత 15 రా.2:34 కు
కరణం: బాలవ సా.4.02 కు తదుపరి కౌలవ రా.3.06 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.4:38-5:27 కు
వర్జ్యం: ఉ.5.47-7.17కు పునః సా.6.23-7.53 కు
అమృతకాలం: రా.11:09-12:40 కు
సూర్యోదయం: ఉ. 5:50 కు
సూర్యాస్తమయం: సా. 6:07 కు
🕉️ పితృపక్షాలు 7 వ దినము సూర్యసావర్ణిక మన్వాది, మధ్యాష్టమి, కలియుగాది 🕉️
గురుబోధ:
భూలోకంలో ఉన్న వారికి పగలు, రాత్రి కలిస్తే ఒక రోజు అంటారు. దేవతలకు ఉత్తరాయణం, దక్షిణాయనం కలిపితే ఒక రోజు (అంటే మనకు ఒక సంవత్సరం). పితృదేవతలకు శుక్ల పక్షము, కృష్ణ పక్షము కలిస్తే ఒక రోజు (మనకు 30 రోజులు). అందుకే ప్రతి నెల అమావాస్యనాడు వారికి తప్పక తర్పణాలు, స్వయంపాకం దానం ఇవ్వడం చేయాలి.
పితృదేవతా స్తోత్రం👇
https://youtu.be/UgnxFM4YHYY?si=uUfkETkRGcPPOrTw