Sep 14 2024సెప్టెంబరు 14 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 14 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం

తిథి: ఏకాదశి సా. 4.27 కు తదుపరి ద్వాదశి
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: ఉత్తరాషాఢ సా. 5.41 కు తదుపరి శ్రవణం
యోగం: శోభన సా. 06.18 కు తదుపరి అతిగండ
కరణం: వణిజ ఉ. 08.41 కు తదుపరి విష్టి
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: తె. 06.04 - 07.42 కు
వర్జ్యం: రా. 9.33 - 11.06 కు
అమృతకాలం: ఉ. 11.26 - 1.00 కు
సూర్యోదయం: ఉ. 6.04 కు
సూర్యాస్తమయం: సా. 6.19 కు

శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=P3uhz2umkoo8lmNX

🕉️ భాద్రపద శుక్ల ఏకాదశి 🕉️

ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ రేపు చేయాలి.

గురుబోధ:
1) ఈ భాద్రపద శుక్ల ఏకాదశిని పద్మనాభ ఏకాదశి అంటారు. ఇది భద్రములు కలిగిస్తుంది.
2) ఈ పద్మనాభ ఏకాదశి ఉపవాస దీక్ష మహాఫలితం వల్ల ఏడు జన్మములలో చేసిన పాపాలు తొలగిపోతాయి. దేవతలు సంతోషిస్తారు.
3) అనావృష్టి తొలగాలంటే, వర్షములు సకాలంలో కురవాలంటే, రోగములు తొలగాలంటే ఈ ఉపవాస దీక్ష చేస్తే తొలగిపోతాయి. సంతృప్తి రావాలంటే కూడా ఈ ఏకాదశీ ఉపవాస వ్రతం చేసి భక్తితో ఆ భగవంతుడిని ప్రార్థిస్తే మనశ్శాంతి కలుగుతుంది.

expand_less