Sep 13 2025సెప్టెంబరు 13 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 13 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం

తిథి: షష్ఠి మ.12.59 కు తదుపరి సప్తమి 14 ఉ.10.36 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: కృత్తిక మ.2.55 కు తదుపరి రోహిణి 14 మ.1.13 కు
యోగం: హర్షణ ఉ.10:32 కు తదుపరి వజ్ర 14 ఉ.7:35 కు
కరణం: వణిజ ఉ.7.23 కు తదుపరి విష్టి రా.6.11 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.7:44-8:33 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: ఉ.7.58-9.26 కు
సూర్యోదయం: ఉ. 5:50 కు
సూర్యాస్తమయం: సా. 6:07 కు

🕉️ మహాలయ పక్షారంభము (పితృపక్షములు), 6వ రోజు 🕉️

గురుబోధ:
ప్రతి సంవత్సరము అర్హత కల్గినవారు పితృతర్పణములు 96 పర్వదినములలో ఇవ్వడం మంచిదని ధర్మశాస్త్రం. దానినే షణ్ణవతి శ్రాద్ధం లేదా తర్పణ పుణ్యకాలం అంటారు. అవి 12 అమావాస్యలు, 12 సంక్రమణలు, 14 మన్వంతరములు, 4 ఉగాదులు (కృత, త్రేత, ద్వాపర, కలి ఉగాదులు) - మాఘ అమావాస్య, భాద్రపద కృష్ణ త్రయోదశి, వైశాఖ శుక్ల తృతీయ, కార్తిక శుక్ల నవమి), వైధృతి కరణములు - 13
వ్యతీపాత యోగములు - 13, మహాలయ పక్షములు, అష్టక శ్రాద్ధములు (మార్గశీర్షం, పుష్యం, మాఘం , ఫాల్గునం - బహుళ (కృష్ణ) పక్షం సప్తమి, అష్టమి, నవమి) వంటి పర్వదినములలో చేయడం వలన పితృదేవతల అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది.

పితృదేవతా స్తోత్రం👇
https://youtu.be/UgnxFM4YHYY?si=uUfkETkRGcPPOrTw

expand_less