Sep 13 2023సెప్టెంబరు 13 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబరు 13 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షము

తిథి : చతుర్దశి 14వ తేదీ తె. 04గం౹౹04ని౹౹ వరకు తదుపరి అమావాస్య
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం : మఘ రా. 02గం౹36ని౹౹ వరకు తదుపరి పుబ్బ
యోగం : సిద్ధ రా. 02గం౹౹08ని౹౹ వరకు తదుపరి సాధ్య
కరణం :  విష్టి మ. 03గం౹౹35ని౹౹ వరకు తదుపరి శకుని
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹32ని౹౹ నుండి 12గం౹౹21ని౹౹ వరకు 
వర్జ్యం : మ. 01గం౹౹19ని౹౹ నుండి 03గం౹౹05ని౹౹ వరకు
అమృతకాలం : రా. 11గం౹౹56ని౹౹ నుండి 01గం౹౹42ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹51ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹02ని౹౹కు

🕉️ మాస శివరాత్రి 🕉️

గురుబోధ
తనకు తోచినప్పుడల్లా అనేక పార్ధివలింగాలని తయారుచేసుకుని, వీలున్నప్పుడల్లా అర్చన చేసేవాడు, అందులో ముఖ్యంగా సోమవారం కానీ, చతుర్దశి నాడు కానీ, మాస శివరాత్రి కానీ, అష్టమినాడు కానీ, శివరాత్రి కానీ ఇటువంటి పర్వదినాలలో లెక్కపెట్టకుండా తోచినన్ని పార్ధివలింగాలని చేసి పూజించువాడు ముక్తి పొంది తీరుతాడు. నాకు భూమి కావాలి, కాస్త స్థలమో, పొలమో కావాలి అనుకున్నవాడు వెయ్యి పార్ధివలింగాలని భక్తితో పూజించినవాడు, అభిషేకించినవాడు తప్పక భూమిని పొందుతాడు. శివానుగ్రహం ఒకటే కావాలనుకున్న వాడు, పరమేశ్వరుని యెుక్క కరుణ కావాలనుకున్న వాడు, 3000 పార్ధివలింగాలని అభిషేకం చేసుకోవాలి. అభిషేకాలు, అర్చనలు ఇంట్లో కంటే  గుడిలో, గుడిలో కంటే తీర్ధ స్థలాలలో, నదీ తీరాలలో ఇంకొంచెం ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. అదే గంగానదీ తీరంలో చేసుకుంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. కాశీ వంటి దివ్య క్షేత్రాలలో గంగాతీరంలో చేసుకుంటే అనంత ఫలితం ఇస్తుంది. ఇలా వారి వారి శక్తిని బట్టి చేసుకోమన్నారు. ఆర్ధికంగా చితికిపోయిన వారికి ఇది ఒక గొప్ప అవకాశం. శివుడు అవ్యాజకరుణామూర్తి. ఒకవేళ మన దగ్గర ధనం లేదు, అభిషేకము చేయడానికి పంచామృతాలు లేవు, అప్పుడు ఇన్ని నీళ్లు జల్లినా సంతోషిస్తాడు. - శ్రీ శివమహాపురాణం

expand_less